కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 82
  • నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమయాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి?
  • మీరు ఏం చేయవచ్చు?
  • కాలవిలంబం—సమయాన్ని దొంగిలిస్తుంది
    తేజరిల్లు!—1995
  • నేనెలా పనుల్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • హోమ్‌వర్క్‌ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది?
    తేజరిల్లు!—2004
  • పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 82
సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేక పోయినందుకు ఒక టీనేజీ అబ్బాయి బాధపడుతున్నాడు—హోమ్‌వర్క్‌ చేయకుండా ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు, టీవీ చూస్తున్నాడు

యువత అడిగే ప్రశ్నలు

నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

  • సమయాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి?

  • మీరు ఏం చేయవచ్చు?

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

సమయాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి?

  • సమయం డబ్బులాంటిది. దాన్ని వృథా చేస్తే, అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉండదు. అదే మీరు పొదుపుగా వాడితే, మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి కొంత సమయం మిగులుతుంది!

    బైబిలు సూత్రం: “సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.”—సామెతలు 13:4.

    ఒక్క మాటలో: సమయాన్ని జాగ్రత్తగా వాడితే ఎక్కువ తీరిక దొరుకుతుంది

  • సమయాన్ని జాగ్రత్తగా వాడడం ఒక కళ. పెద్దయ్యాక అది మీకు బాగా ఉపయోగపడుతుంది. సమయాన్ని జాగ్రత్తగా వాడడం ఎంత ముఖ్యమంటే, దాన్నిబట్టి మీ ఉద్యోగం ఉండవచ్చు, పోవచ్చు. అంతెందుకు మీరే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ లేటుగా వచ్చే వ్యక్తిని పనిలో పెట్టుకుంటారా?

    బైబిలు సూత్రం: “చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు.”—లూకా 16:10.

    ఒక్క మాటలో: మీరు సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నారనే దాన్నిబట్టి మీరెలాంటి వ్యక్తో తెలుస్తుంది.

నిజమే, సమయాన్ని జాగ్రత్తగా వాడడం అంత తేలిక కాదు. కొన్ని ఆటంకాలు పరిశీలించండి.

ఆటంకం #1: ఫ్రెండ్స్‌

“బయటికి రమ్మని ఫ్రెండ్స్‌ అడిగితే, నాకు నిజంగా టైం లేకపోయినా వాళ్లతోపాటు వెళ్లిపోయేదాన్ని. ‘ఏముందిలే, ఇంటికి వచ్చాక త్వరత్వరగా నా పని చేసుకోవచ్చు’ అనుకునేదాన్ని. కానీ అన్నిసార్లూ అలా కుదర్లేదు, చెప్పాలంటే నా పనిలో చాలా తప్పులు దొర్లేవి.”—సింథియా.

ఆటంకం #2: టైం తినేసేవి

“టీవీ ఒక వాక్యూమ్‌ క్లీనర్‌ లాంటిది. కార్యక్రమాలతో, సినిమాలతో అది మిమ్మల్ని లోపలికి లాగేసుకుంటుంది, దాన్ని వదిలించుకోవడం కష్టం.”—ఐవీ.

“నా ట్యాబ్‌తో గంటలుగంటలు టైం వేస్ట్‌ చేస్తాను. బ్యాటరీ మొత్తం అయిపోయే వరకు దాన్ని వాడి, తర్వాత బాధపడతాను.”—మరీ.

ఆటంకం #3: వాయిదా వేయడం

“నేను హోమ్‌వర్క్‌ని, ఇతర పనుల్ని వాయిదా వేస్తుంటాను. పూర్తి చేయాల్సిన పనిని పక్కనపెట్టి, అనవసరమైన వాటికోసం సమయం వృథా చేస్తాను. అది అస్సలు మంచి పద్ధతి కాదు.”—బెత్‌.

సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించినందుకు ఒక టీనేజీ అబ్బాయి సంతోషిస్తున్నాడు—ముందు చదువుకున్నాడు, తర్వాత హోమ్‌వర్క్‌ చేసుకున్నాడు, అప్పటికీ ఫుట్‌బాల్‌ ఆడుకోవడానికి సమయం ఉంది

సమయాన్ని జాగ్రత్తగా వాడితే ఎక్కువ తీరిక దొరుకుతుంది

మీరు ఏం చేయవచ్చు?

  1. మీరు చేయాల్సిన పనుల్ని లిస్టు రాసుకోండి. అంటే ఇంటి పనులు, మీ హోమ్‌వర్క్‌ లాంటివి. ఒక వారంలో, వాటికి ఎంతెంత సమయం అవసరమౌతుందో రాసుకోండి.

    బైబిలు సూత్రం: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10.

  2. ఖాళీ సమయంలో చేయాలనుకుంటున్న పనుల్ని లిస్టు రాసుకోండి. అంటే ఇంటర్నెట్‌ వాడడం, టీవీ చూడడం లాంటివి. ఒక వారంలో, వాటికి మీరు ఎన్నెన్ని గంటలు వెచ్చిస్తారో రాసుకోండి.

    బైబిలు సూత్రం: “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకుంటూ, ... తెలివిగా మసలుకోండి.”—కొలొస్సయులు 4:5.

  3. ఒక ప్లాన్‌ తయారుచేసుకోండి. మీరు రాసుకున్న రెండు లిస్టుల్ని ఒకసారి చూసుకోండి. ముఖ్యమైన పనులకు తగినంత సమయం కేటాయించారా? సరదా పనుల కోసం కేటాయించిన సమయాన్ని తగ్గించాలా?

    టిప్‌: ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనుల్ని రాసుకుని, అయిపోగానే టిక్‌ పెట్టుకోండి.

    బైబిలు సూత్రం: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.”—సామెతలు 21:5.

  4. ఆచరణలో పెట్టండి. నిజమే, మీరు ఏదైనా ఆహ్వానాన్ని కాదని, ముఖ్యమైన పనులు చేసుకోవాల్సి రావచ్చు. కానీ దానివల్ల మీకు ఎక్కువ తీరిక దొరుకుతుంది, సరదాగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఆ విషయం మీరే తెలుసుకుంటారు.

    బైబిలు సూత్రం: “కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండండి, కాలయాపన చేస్తూ పనిచేయకండి.”—రోమీయులు 12:11, అధస్సూచి.

  5. ముందు కష్టపడండి, తర్వాత ఎంజాయ్‌ చేయండి. తార అనే యువతి ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు నేను రాసుకున్న లిస్టులో ఏవైనా రెండు పనులు పూర్తిచేశాక, ‘ఓకే, ఇప్పుడు 15 నిమిషాలు టీవీ చూస్తాను, ఆ తర్వాత మళ్లీ పనులు మొదలుపెడతాను’ అనుకుంటాను. తీరా ఆ 15 నిమిషాలు 30 నిమిషాలు అవుతాయి, 30 నిమిషాలు కాస్తా గంట అవుతుంది, అలా నాకు తెలియకుండానే టీవీ చూస్తూ రెండు గంటలు అయిపోతాయి!”

    మరి పరిష్కారం ఏంటి? పనులు పూర్తిచేశాక వినోదానికి సమయం ఇవ్వండి, అంతేకానీ వినోదానికి రోజులో ఎంతోకొంత సమయం ఇచ్చి తీరాల్సిందే అని అనుకోకండి.

    బైబిలు సూత్రం: “తన కష్టార్జితముచేత సుఖపడుటకంటె నరునికి మేలుకరమైనదేదియు లేదు.”—ప్రసంగి 2:24.

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

షియన్‌

“లిస్టు రాసిపెట్టుకోవడం వల్ల నేను ఏమేమి పనులు చేయాలో అర్థమౌతుంది. ‘నేను రీచార్జ్‌ అవ్వడానికి’ కాస్తంత విశ్రాంతి సమయం కూడా పెట్టుకుంటాను. లిస్టు రాసుకోవడం వల్ల, నా షెడ్యూల్‌లో ఎక్కడ ఖచ్చితంగా ఉండాలో, ఎక్కడ కాస్త వెసులుబాటు ఉందో నాకు తెలుస్తుంది.”—షియన్‌.

శామ్యూల్‌

“నేను చేయలేని పనులకు ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను. అలా చెప్పడం కష్టమే. కానీ, దానిమీద పూర్తిగా మనసుపెట్టలేను కాబట్టే నేను ఆ పని ఒప్పుకోవట్లేదని వివరించినప్పుడు, ఎదుటి వ్యక్తికి నా మీద కోపం రాకుండా ఉంటుంది.”—శామ్యూల్‌.

బ్రూక్లిన్‌

“నా షెడ్యూల్‌లో అస్సలు తీరిక లేనప్పుడు నిద్రకు, ఎక్సర్‌సైజ్‌కు టైం తగ్గించాలి అనుకున్నాను. కానీ, కొన్నిసార్లు నేను వాటికోసం అదనంగా పెట్టే ఆ ఒక్క గంటే నా పనితనాన్ని, సంతోషాన్ని పెంచేది. మన ఆరోగ్యాన్ని చూసుకోవడం ప్రాముఖ్యం కదా.”—బ్రూక్లిన్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి