కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 149
  • “కంటికి కన్ను” అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కంటికి కన్ను” అంటే ఏమిటి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • “కంటికి కన్ను” అనే నియమం ఉద్దేశం ఏమిటి?
  • “కంటికి కన్ను” అనే నియమాన్ని క్రైస్తవులు పాటించాలా?
  • “కంటికి కన్ను” అనే నియమం గురించి అపోహలు
  • మీ కంటిని తేటగా ఉంచుకోండి
    మన రాజ్య పరిచర్య—2004
  • ముఖకవళికలను గమనించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2005
  • మీ కన్ను తేటగా ఉందా?
    మన రాజ్య పరిచర్య—2010
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 149
ఒక వ్యక్తి కళ్లు

“కంటికి కన్ను” అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుడు మోషే ద్వారా ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో “కంటికి కన్ను” అనే నియమం ఉండేది. యేసు కూడా కొండమీద ప్రసంగంలో ఈ నియమాన్ని ప్రస్తావించాడు. (మత్తయి 5:38; నిర్గమకాండము 21:24, 25; ద్వితీయోపదేశకాండము 19:21) నేరస్తునికి విధించే శిక్ష, అతను చేసిన తప్పుకు సరిపోయేలా ఉండాలనేది ఈ నియమం ఉద్దేశం.a

ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని తలపెట్టిన వ్యక్తులకు ఈ నియమం వర్తిస్తుంది. అలాంటి వ్యక్తులకు విధించే శిక్ష గురించి మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, “విరుగ గొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికిపల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.”—లేవీయకాండము 24:20.

  • “కంటికి కన్ను” అనే నియమం ఉద్దేశం ఏమిటి?

  • “కంటికి కన్ను” అనే నియమాన్ని క్రైస్తవులు పాటించాలా?

  • “కంటికి కన్ను” అనే నియమం గురించి అపోహలు

  • తప్పుడు ఆలోచనను యేసు సరిచేశాడు

“కంటికి కన్ను” అనే నియమం ఉద్దేశం ఏమిటి?

“కంటికి కన్ను” అనే నియమం, ఎవరికి వాళ్లే పగ తీర్చుకోవడాన్ని ప్రోత్సహించట్లేదు. బదులుగా న్యాయాధిపతులు నేరస్తులకు సరైన శిక్ష విధించడానికి ఆ నియమం ఉపయోగపడింది. అంటే బాగా కఠినమైన శిక్ష లేదా తేలికైన శిక్ష కాకుండా, తప్పుకు సరిపడా శిక్ష విధించడానికి సహాయపడింది.

అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని తలపెట్టేవాళ్లకు, లేదా హాని తలపెట్టేందుకు కుట్ర పన్నేవాళ్లకు ఈ నియమం హెచ్చరికగా ఉండేది. ధర్మశాస్త్రం ఇలా వివరించింది, “మిగిలినవారు విని [దేవుని తీర్పు అమలు చేయబడడం వినేవాళ్లు] భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.”—ద్వితీయోపదేశకాండము 19:20.

“కంటికి కన్ను” అనే నియమాన్ని క్రైస్తవులు పాటించాలా?

లేదు, ఈ నియమం క్రైస్తవులకు వర్తించదు. యేసు మరణం ద్వారా, ఈ నియమం ఉన్న మోషే ధర్మశాస్త్రం ముగింపుకొచ్చింది.—రోమీయులు 10:4.

అయినప్పటికీ, దేవుని ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోవడానికి ఈ నియమం సహాయపడుతుంది. ఉదాహరణకు, దేవుడు న్యాయాన్ని విలువైనదిగా ఎంచుతాడని అది తెలియజేస్తుంది. (కీర్తన 89:14) అంతేకాదు, నేరస్తులకు “మితముగా” లేదా తగిన మోతాదులో శిక్షపడాలనే ఆయన న్యాయప్రమాణాన్ని కూడా అది తెలియజేస్తుంది.—యిర్మీయా 30:11.

“కంటికి కన్ను” అనే నియమం గురించి అపోహలు

అపోహ: “కంటికి కన్ను” అనేది చాలా కఠినమైన నియమం.

నిజం: న్యాయాన్ని కఠినమైన లేదా క్రూరమైన రీతిలో అమలు చేయాలనేది ఈ నియమం ఉద్దేశం కాదు. బదులుగా, అర్హులైన న్యాయాధిపతులు ఏదైనా తప్పుకు శిక్ష విధించేముందు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు జరిగింది, ఉద్దేశపూర్వకంగా ఆ తప్పు చేశారా వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత శిక్ష విధించాలనే ఉద్దేశంతో ఆ నియమం ఇవ్వబడింది. (నిర్గమకాండము 21:28-30; సంఖ్యాకాండము 35:22-25) ఒక విధంగా చెప్పాలంటే, కఠినమైన శిక్షలు విధించకుండా ఈ నియమం హద్దులు పెట్టింది.

అపోహ: “కంటికి కన్ను” అనే నియమం అంతులేని వ్యక్తిగత ప్రతీకారాన్ని ప్రోత్సహించింది.

నిజం: ‘కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపం ఉంచుకోకూడదు’ అని మోషే ధర్మశాస్త్రం తెలియజేసింది. (లేవీయకాండము 19:18) ధర్మశాస్త్రం వ్యక్తిగత కక్షల్ని ప్రోత్సహించలేదు. బదులుగా, దేవుని మీద అలాగే తప్పుల్ని సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంచమని ప్రజల్ని ప్రోత్సహించింది.—ద్వితీయోపదేశకాండము 32:35.

తప్పుడు ఆలోచనను యేసు సరిచేశాడు

కొంతమంది “కంటికి కన్ను” అనే నియమాన్ని తప్పుగా అన్వయించారని యేసుకు తెలుసు. వాళ్లను సరిదిద్దుతూ యేసు ఇలా అన్నాడు, ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్తున్నాను, దుష్టుడైన వ్యక్తిని ఎదిరించకండి; కానీ మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టే వ్యక్తికి ఎడమ చెంప కూడా చూపించండి.”—మత్తయి 5:38, 39.

“చెప్పబడిందని మీరు విన్నారు కదా” అని యేసు అన్న మాటల్ని గమనించండి. ఆయన బహుశా, ప్రతీకారం తీర్చుకోవాలని బోధించిన కొంతమంది యూదా మతనాయకుల్ని ఉద్దేశిస్తూ ఆ మాటలు చెప్పివుంటాడు. దానిగురించి ఆడమ్‌​ క్లార్క్‌​ అనే బైబిలు విద్వాంసుడు ఇలా అన్నాడు, “వ్యక్తిగత కక్షల్ని తీర్చుకోవడానికి, ప్రతీకార చర్యలకు పూనుకోవడానికి . . . యూదులు ఈ నియమాన్ని [కంటికి కన్ను] ఆధారంగా చేసుకున్నారని అనిపిస్తుంది.” ఆ మతనాయకులు, ప్రతీకారాన్ని ప్రోత్సహించడం ద్వారా దేవుని ధర్మశాస్త్రం అసలు ఉద్దేశాన్ని తప్పుదారి పట్టించారు.—మార్కు 7:13.

వాళ్లకు భిన్నంగా యేసు, దేవుని ధర్మశాస్త్రానికి మూలం ప్రేమ అని నొక్కిచెప్పాడు. ఆయనిలా అన్నాడు, ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా. రెండో ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అదేమిటంటే, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” ఈ రెండు ఆజ్ఞలే మొత్తం ధర్మశాస్త్రానికి ఆధారం.’ (మత్తయి 22:37-40) తన నిజమైన అనుచరులకు గుర్తింపు ప్రతీకారం కాదుగానీ ప్రేమ అని యేసు బోధించాడు.—యోహాను 13:34, 35.

a కొన్నిసార్లు ఈ న్యాయ సూత్రాన్ని లెక్స్‌​ టాలియోనిస్‌​ అనే లాటిన్‌​ పదంతో కూడా పిలుస్తారు. ఈ సూత్రం ఇతర ప్రాచీన న్యాయ వ్యవస్థల్లో కూడా ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి