కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 136
  • మరియ దేవుని తల్లా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరియ దేవుని తల్లా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • మరియ “దేవుని మాత”యా?
    తేజరిల్లు!—1996
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలు!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 136
చిన్నారి యేసుతో మరియ

మరియ దేవుని తల్లా?

బైబిలు ఇచ్చే జవాబు

కాదు, మరియ దేవుని తల్లి అని బైబిలు బోధించడం లేదు. అంతేకాదు, మరియను ఆరాధించడం లేదా పూజించడం లాంటివి చేయమని కూడా బైబిలు ఎక్కడా చెప్పట్లేదు.a ఈ కింది విషయాలను గమనించండి:

  • తాను దేవుని తల్లినని మరియ ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆమె ‘దేవుని కుమారుడికి’ జన్మనిచ్చిందేగానీ దేవునికి కాదని బైబిలు వివరిస్తుంది.—మార్కు 1:1; లూకా 1:32.

  • మరియ దేవుని తల్లని, లేదా ఆమె ఆరాధనకు అర్హురాలని యేసు ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి, యేసు తల్లిగా మరియ సంతోషంగా ఉంటుంది అని ఒక స్త్రీ అన్నప్పుడు, యేసు ఆమెను సరిదిద్దుతూ ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!”—లూకా 11:27, 28.

  • “దేవుని తల్లి,” “తియోటొకోస్‌” (దేవున్ని మోసింది) అనే పదాలు బైబిల్లో లేవు.

  • బైబిల్లో “ఆకాశ రాణి” అనే పదం మరియను సూచించడం లేదు గానీ మతభ్రష్ట ఇశ్రాయేలీయులు ఆరాధించిన అబద్ధ దేవతలను సూచిస్తుంది. (యిర్మీయా 44:15-19) బహుశా “ఆకాశ రాణి” బబులోను దేవతైన ఇష్తార్‌ను (అష్తారోతు) సూచిస్తుండవచ్చు.

  • తొలి క్రైస్తవులు మరియను ఆరాధించడం గానీ, ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం గానీ చేయలేదు. వాళ్లు “అన్యమత ఆచారాల్ని వ్యతిరేకించారు. అంతేకాదు మరియ మీదే ఎక్కువ శ్రద్ధ వహిస్తే అది దేవత ఆరాధనకు దారితీస్తుందని వాళ్లు భయపడి ఉండవచ్చు” అని ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు—ఇన్‌ క్వెష్ట్‌ ఆఫ్‌ ది జూయిష్‌ మేరి.

  • దేవుడు ఎప్పుడూ ఉనికిలో ఉన్నాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 90:1, 2; యెషయా 40:28) ఆయనకు ఆరంభం లేదు కాబట్టి ఆయనకు తల్లి కూడా ఉండే అవకాశం లేదు. ఇంకా, మరియ దేవున్ని తన గర్భంలో పట్టి ఉంచలేదు; ఎందుకంటే, ఆకాశమహాకాశాలే దేవున్ని పట్టి ఉంచలేవని బైబిలు స్పష్టంగా చెప్తుంది.—1 రాజులు 8:27.

మరియ “దేవుని తల్లి” కాదు యేసు తల్లి

మరియ యూదా గోత్రంలో పుట్టింది, ఆమె దావీదు రాజు వంశం నుండి వచ్చింది. (లూకా 3:23-31) మరియ తనకున్న విశ్వాసం, భక్తి వల్ల దేవునికి ఇష్టురాలైంది. (లూకా 1:28) అందుకే యేసు తల్లి అవ్వడానికి దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. (లూకా 1:31, 35) మరియ, ఆమె భర్త యోసేపుకు ఇంకా ఇతర పిల్లలు కూడా పుట్టారు.—మార్కు 6:3.

మరియ యేసు శిష్యురాలైందని బైబిలు చెప్తునప్పటికీ, ఆమె గురించి అదనపు వివరాలు తెలియజేయడం లేదు.—అపొస్తలుల కార్యాలు 1:14.

కొంతమంది మరియను దేవుని తల్లిగా ఎందుకు భావిస్తున్నారు?

క్రీ.శ. 4వ శతాబ్దం నుండే మరియను ఆరాధించడం మొదలైంది. ఆ సమయంలో క్యాథలిక్‌ చర్చి, రోమా సామ్రాజ్యానికి అధికార మతం అయ్యింది. ఫలితంగా అన్య మతాలకు చెందిన చాలామంది, నామకార్థ క్రైస్తవులుగా మారారు. చర్చి, ఎటువంటి లేఖనాధారం లేని త్రిత్వాన్ని బోధించడం మొదలుపెట్టింది.

చర్చిలోని చాలామంది, యేసు దేవుడైతే, మరియ దేవుని తల్లే అనే ముగింపుకు రావడానికి త్రిత్వ సిద్ధాంతం దారి తీసింది. సా.శ. 431లో ఎఫెసులోని చర్చి కౌన్సిల్‌ మరియను “దేవుని తల్లి” అని అధికారికంగా ప్రకటించింది. కౌన్సిల్‌ ఇలా ప్రకటించాక, మరియ ఆరాధన అంటే మరియను దేవతగా పూజించడం ఎక్కువైంది. అన్యమతాలకు చెందినవాళ్లు చర్చిలో చేరాక, వాళ్ల సంతాన సాఫల్య దేవతైన అర్తెమియ, ఐసిస్‌ (రోమన్లకు డయానా) దేవతల విగ్రహాల బదులు క్రమక్రమంగా కన్యకయైన మరియ విగ్రహాల్ని, బొమ్మల్ని ఆరాధించడం మొదలుపెట్టారు.

సా.శ. 432లో సిక్స్‌టస్‌ III అనే పోపు “దేవుని తల్లి” గౌరవార్థం రోములో చర్చి నిర్మించబడాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ చర్చి, పిల్లల్ని ప్రసాదించే రోమన్ల దేవతైన లూసినా ఆలయం దగ్గర్లో నిర్మించబడింది. ఒక రచయిత ఆ చర్చి గురించి ఇలా చెప్తున్నాడు: “రోము పట్టణం క్రైస్తవీకరణ చెందిన తర్వాత, ఈ చర్చి అన్యమత గుంపులు గొప్ప తల్లిగా చేసే ఆరాధనను, మరియ ఆరాధనగా మార్చేసింది.”—మేరీ—ది కంప్లీట్‌ రిసోర్స్‌.

a చాలా క్రైస్తవ మతశాఖలు మరియ దేవుని తల్లి అని బోధిస్తున్నాయి. వాళ్లు ఆమెను “ఆకాశ రాణి” లేదా తియోటొకోస్‌ అని భావిస్తున్నారు. ఈ తియోటొకోస్‌ అనే గ్రీకు పదానికి “దేవున్ని మోసింది” అని అర్థం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి