కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 133
  • నెఫీలీయులు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నెఫీలీయులు ఎవరు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • మీరు హింసకులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దుష్టత్వం వెనకున్నది ఎవరో బహిర్గతమైంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 133
దౌర్జన్యం చేస్తున్న నెఫీలీయుడు

నెఫీలీయులు ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

నోవహు రోజుల్లో చెడ్డ దేవదూతలు మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల పుట్టిన సంకరజాతి పిల్లలే నెఫీలీయులు. వాళ్లు భారీకాయులు, క్రూరులు.a

‘దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని’ గమనించినట్లు బైబిలు చెప్తుంది. (ఆదికాండము 6:2) నిజానికి, ఆ “దేవుని కుమారులు” దేవుని మీద తిరుగుబాటు చేసిన అదృశ్య ప్రాణులు. వాళ్లు పరలోకంలో “తాము ఉండాల్సిన చోటును వదిలేసి” భూమ్మీదికి వచ్చి మనిషి రూపం ధరించి ‘తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు.’—యూదా 6; ఆదికాండము 6:2.

ఆ సృష్టి విరుద్ధమైన కలయిక వల్ల పుట్టిన సంకరజాతి పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండేవాళ్లు కాదు. (ఆదికాండము 6:4) వాళ్లు భారీకాయులు, అందర్నీ హింసించేవాళ్లు. ఆ దౌర్జన్యపరులు భూమిని హింసతో నింపేశారు. (ఆదికాండము 6:13) బైబిలు వాళ్లను “పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు” అని పిలుస్తోంది. (ఆదికాండము 6:4) కొంతకాలానికి, వాళ్లలాగే ప్రజలందరూ దౌర్జన్యపరులుగా తయారయ్యారు.—ఆదికాండము 6:5; సంఖ్యాకాండము 13:33.b

నెఫీలీయుల గురించి అపోహలు

అపోహ: ఇప్పటికీ భూమ్మీద నెఫీలీయులు ఉన్నారు.

నిజం: ప్రాచీన కాలంలో యెహోవా భూమ్మీద ఒక గొప్ప జలప్రళయం రప్పించి భూమిని హింసతో నింపేసిన ప్రజలందర్నీ నాశనం చేశాడు. వాళ్లతోపాటే నెఫీలీయులందరూ నాశనమయ్యారు. యెహోవాకు నచ్చినట్లు జీవించిన నోవహు, ఆయన కుటుంబం మాత్రమే ఆ కాలంలోని జలప్రళయం నుండి రక్షించబడ్డారు—ఆదికాండము 6:9; 7:12, 13, 23; 2 పేతురు 2:5.

అపోహ: నెఫీలీయుల తండ్రులు మనుషులు.

నిజం: బైబిలు వాళ్ల తండ్రులను “దేవుని కుమారులు” అని పిలుస్తుంది. (ఆదికాండము 6:2) దేవదూతల్ని వర్ణించడానికి కూడా బైబిలు అదే పదాన్ని ఉపయోగించింది. (యోబు 1:6; 2:1; 38:7; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) దేవదూతలకు మనిషి రూపం ధరించే శక్తి ఉండేది. (ఆదికాండము 19:1-5; యెహోషువ 5:13-15) అపొస్తలుడైన పౌలు “బంధించబడివున్న దేవదూతల” గురించి మాట్లాడాడు. “ఆ దూతలు నోవహు కాలంలో అవిధేయులయ్యారు” అని కూడా ఆయన చెప్పాడు. (1 పేతురు 3:19, 20) ఆ సందర్భం గురించే మాట్లాడుతూ బైబిలు రచయిత యూదా కూడా, కొందరు దేవదూతలు ‘తమ అసలు స్థానాన్ని కాపాడుకోకుండా, తాము ఉండాల్సిన చోటును వదిలేశారు’ అని చెప్పాడు—యూదా 6.

అపోహ: భూమ్మీద పడేయబడిన దేవదూతలే నెఫీలీయులు.

నిజం: ఆదికాండము 6:4 సందర్భాన్ని గమనిస్తే నెఫీలీయులు దేవదూతలు కాదుగానీ, మనిషి రూపం ధరించిన దేవదూతలకు, స్త్రీలకు పుట్టిన సంకరజాతి సంతానమని అర్థమౌతుంది. ఆ దేవదూతలు ‘తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్న” తర్వాత, యెహోవా ఆ కాలంలో ఉన్న దైవభక్తిలేని ప్రజల మీద 120 ఏళ్లలో చర్య తీసుకుంటానని చెప్పాడు. (ఆదికాండము 6:1-3) బైబిలు ఇంకా ఇలా చెప్తుంది, “ఆ దినములలో” మనిషి రూపం ధరించిన దేవదూతలు “నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు [నెఫీలీయులు] వీరే.”—ఆదికాండము 6:4.

a ‘నెఫీలీయులు’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి బహుశా “పడేసేవాళ్లు” అనే అర్థం ఉండవచ్చు. “హింసించడానికి, దోచుకోవడానికి మనుషుల మీద పడి వాళ్లను కిందపడేలా చేసేవాళ్లు” అనే అర్థం ఆ పదానికి ఉండవచ్చని విల్సన్స్‌ ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ వర్డ్‌ స్టడీస్‌ చెప్తుంది.

b సంఖ్యాకాండము 13:33 లో ఉన్న మాటలు చెప్పిన వ్యక్తులకు, కొంతమంది ప్రజలను చూసినప్పుడు వందల సంవత్సరాల క్రితమే చనిపోయిన నెఫీలీయులు గుర్తుకొచ్చారు.—ఆదికాండము 7:21-23.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి