కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 128
  • బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • నరకమును గూర్చిన సత్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీరు బైబిలును నమ్మగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నరకము వేడిగా ఉన్నదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 128
పర్గేటరీ ఊహాచిత్రం

బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు

లేదు. పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం అనే మాటే బైబిల్లో లేదు. అంతేకాదు చనిపోయినవాళ్ల ఆత్మలు పాపవిమోచనా లోకంలో శుద్ధి చేయబడతాయని కూడా బైబిలు చెప్పడం లేదు.a పాపమరణాల గురించి బైబిలు ఏమి బోధిస్తుందో, ఆ బోధలు పర్గేటరీ సిద్ధాంతానికి ఎలా విరుద్ధంగా ఉన్నాయో పరిశీలించండి.

  • పర్గేటరీలో ఉండడంవల్ల కాదుగానీ యేసు రక్తం మీద విశ్వాసం ఉంచడం వల్ల ఒక వ్యక్తి పాపం నుండి శుద్ధి అవుతాడు. “[దేవుని] కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేస్తుంది” అని, “యేసుక్రీస్తు . . . తన రక్తంతో మనల్ని మన పాపాల నుండి విడిపించాడు” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 1:7; ప్రకటన 1:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) యేసు “అనేకుల కోసం విమోచనగా తన ప్రాణాన్ని” ఇచ్చాడు.—మత్తయి 20:28, న్యూ అమెరికన్‌ బైబిల్‌.

  • చనిపోయినవాళ్లు స్పృహలో ఉండరు. “బ్రతికివున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.” (ప్రసంగి 9:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) చనిపోయిన వ్యక్తికి ఎలాంటి స్పర్శ తెలియదు కాబట్టి పర్గేటరీలో ఉన్న అగ్ని చేత ఎలా శుద్ధి అవుతాడు?

  • చనిపోయిన తర్వాత పాపాలకు శిక్ష ఉండదు. “పాపంవల్ల వచ్చే జీతం మరణం” అని, “చనిపోయిన వ్యక్తి పాపం నుండి విడుదల పొందాడు” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 6:7, 23, న్యూ అమెరికన్‌ బైబిల్‌) పాపం చేసినవాళ్లకు మరణానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు.

పర్గేటరీ సిద్ధాంతం అంటే ఏమిటి?

క్యాథలిక్‌ బోధల ప్రకారం, చనిపోయినవాళ్ల ఆత్మలు క్షమాపణ దొరకని తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని శుద్ధి అయ్యే స్థితి లేదా స్థలమే పర్గేటరీ.b “పరలోక ఆనందాన్ని అనుభవించడానికి అవసరమైన పరిశుద్ధత పొందాలంటే” ఇలా శుద్ధి అవ్వడం అవసరమని కాటెకిసమ్‌ ఆఫ్‌ ద క్యాథలిక్‌ చర్చ్‌ చెప్తుంది. అంతేకాదు ‘శుద్ధి చేసే అగ్ని గురించిన బోధ చర్చ్‌ సంప్రదాయంలో ఉంది’ అని కాటెకిసమ్‌ చెప్తుంది. ఆ విషయాన్ని ఈ ఆర్టికల్‌లో ఉన్న బొమ్మలో చూడవచ్చు. కానీ, ఈ సిద్ధాంతానికి లేఖన ఆధారాలు లేవు.

పర్గేటరీ సిద్ధాంతం ఎలా మొదలైంది?

ప్రాచీనకాల గ్రీకులు లింబోని, పర్గేటరీని నమ్మేవాళ్లు. గ్రీకు తత్వసిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని క్లెమెంట్‌ ఆఫ్‌ అలెక్సాండ్రియా, చనిపోయినవాళ్ల పాపాలు అగ్ని చేత శుద్ధీకరించబడతాయని, అలా వాళ్లు విడుదల పొందుతారని చెప్పాడు. అయితే, పర్గేటరీలో అగ్నితో శుద్ధీకరించబడడాన్ని ఖచ్చితంగా నమ్మాలని పోప్‌ గ్రెగరీ ద గ్రేట్‌ చెప్పాడని ద హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియన్‌ డాక్‌ట్రిన్స్‌ పుస్తకంలో ఉంది. అంతేకాదు, పర్గేటరీ అనే సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి క్రీ.శ. 590 నుండి 604 వరకు పోప్‌గా ఉన్న గ్రెగరీ అని ఆ పుస్తకం చెప్తుంది. లియోన్‌ (1274), ఫ్లారెంన్స్‌లో (1439) జరిగిన కౌన్సిల్స్‌లో క్యాథలిక్‌ చర్చ్‌ పర్గేటరీకి అర్థాన్ని వివరించింది. ఆ అర్థం సరైనదని ట్రెంట్‌లో జరిగిన కౌన్సిల్‌లో (1547) క్యాథలి చర్చ్‌ ధృవీకరించింది.

a ఆర్ఫీయస్‌: ఎ జెనరల్‌ హిస్టరీ ఆఫ్‌ రిలిజియన్స్‌ అనే పుస్తకంలో పర్గేటరీ గురించి ఇలా ఉంది, “దానిగురించి సువార్త పుస్తకాల్లో ఒక్క మాట కూడా లేదు.” అదేవిధంగా, న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “చివరిగా తేలింది ఏంటంటే, పర్గేటరీ గురించిన క్యాథలి సిద్ధాంతం సంప్రదాయం నుండి పుట్టిందే గానీ, పవిత్ర లేఖనాల నుండి కాదు.”—సెకండ్‌ ఎడిషన్‌, 11వ సంపుటి, 825వ పేజీ.

b న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా సెకండ్‌ ఎడిషన్‌లో 11వ సంపుటి, 824వ పేజీ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి