కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 114
  • “ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • పాపం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పాపరహిత లోకము—ఎలా సాధ్యము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 114
బాధతో ఉన్న ఒకతను

“ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

“ఏడు మరణకరమైన పాపాలు” అనే ప్రత్యేకమైన లిస్టు అంటూ బైబిల్లో ఏమీలేదు. అయితే, ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటే రక్షణ పొందలేమని బైబిలు చెప్తోంది. ఉదాహరణకు లైంగిక పాపాలు, విగ్రహపూజ, మంత్రవిద్య, విపరీతమైన కోపం, తాగుబోతుతనం వంటి ఘోరమైన పాపాల్ని “పాపపు శరీరం చేసే పనులు” అని బైబిలు పిలుస్తూ, “అలాంటి పనులు చేసేవాళ్లు దేవుని రాజ్యంలో ఉండరు” అని కూడా చెప్తోంది.—గలతీయులు 5:19-21.a

యెహోవాకు అసహ్యములైన ఏడు విషయాలు ఏంటో బైబిలు చెప్పట్లేదా?

చెప్తోంది. కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో సామెతలు 6:16 ఇలా ఉంది, ‘ప్రభువుకు ఆరు విషయాలు హేయములు: అవును ఏడును ఆయనకు హేయములు.’ అయితే, సామెతలు 6:17-19 లో ప్రస్తావించబడిన పాపాల్లోనే అన్ని పాపాలు వస్తాయని కాదు. బదులుగా, అది అన్ని రకాల తప్పుడు పనులను సూచిస్తుంది. అంతేకాదు చెడు ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని కూడా ఆ లేఖనాలు సూచిస్తున్నాయి.b

‘మరణకరమైన పాపం’ అంటే అర్థమేమిటి?

పాపం చేసేవాళ్లు చనిపోతారని బైబిలు స్పష్టంగా చెప్తోంది. కానీ, యేసుక్రీస్తు విమోచన క్రయధనం ఆధారంగా మనం పాపం, మరణం నుండి విడుదల పొందవచ్చు. (రోమీయులు 5:12; 6:23) అయితే, “మరణశిక్ష పడేంత పాపం” చేస్తే దానినుండి బయటపడడానికి క్రీస్తు విమోచన క్రయధనం సహాయం చేయదు. ఇలాంటి పాపం చేసే వ్యక్తి పాపపు జీవితాన్నే గడపాలని నిశ్చయించుకుంటాడు. అతను తన ఆలోచనను, ప్రవర్తనను ఎప్పటికీ మార్చుకోడు. అలాంటి పాపం చేసే వ్యక్తికి “క్షమాపణ ఉండదు” అని బైబిలు కూడా చెప్తోంది.—మత్తయి 12:31; లూకా 12:10.

మరణకరమైన ఏడు పాపాల లిస్టును ఎవరు తయారుచేశారు?

మొదట, ఎనిమిది ప్రధానమైన చెడు లక్షణాల లిస్టును ఆధారం చేసుకొని ఈ “ఏడు మరణకరమైన పాపాలు” తయారుచేయబడ్డాయి. ఈ లిస్టును సా.శ. నాల్గవ శతాబ్దంలో ఈవాగ్రూస్‌ పొంటిక్యూస్‌ తయారుచేశాడు. అతను జాన్‌ క్యాషన్‌ అనే నిష్టగల సెయింట్‌ చెప్పినవాటిని ఆధారంగా చేసుకుని రాశాడు. సా.శ. ఆరవ శతాబ్దంలో పోప్‌ గ్రెగరీ I ఆ ఎనిమిది చెడు లక్షణాలున్న లిస్టును, ఏడు మరణకరమైన పాపాలుగా మార్చాడు. రోమన్‌ క్యాథలిక్‌ మత సిద్ధాంతం ప్రకారం అవి ఇలా ఉన్నాయి: గర్వం, అత్యాశ, కామోద్రేకం, ఈర్య, తిండిబోతుతనం, కోపం, బద్దకం. గ్రెగరీ వీటినే ప్రధాన పాపాలుగా భావించాడు. వాటినుండే మిగతావి కూడా వచ్చాయని అతను భావించాడు.

a గలతీయులు 5:19-21 వచనాల్లో ఉన్న 15 విషయాలు మాత్రమే ఘోరమైన పాపాలు కావు. ఆ వచనాల చివర్లో, “అలాంటి పనులు” అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆ వచనాల్లో చెప్పబడిన విషయాలు కాకుండా ‘అలాంటి పనుల’ కోవలోకి ఇంకా ఏమేమి వస్తాయో ఎవరికివాళ్లు తమ వివేచనా సామర్థ్యాన్ని ఉపయోగించి ఆలోచించుకోవాలి.

b హీబ్రూ భాషలో ఒక జాతీయం ప్రకారం, మొదటి సంఖ్యను ఉపయోగించుకుని రెండవ సంఖ్యను నొక్కిచెప్తుంటారు. ఈ పద్ధతి చాలా వచనాల్లో కనిపిస్తుంది. ఒక ఉదాహరణ సామెతలు 6:16 లో ఉంది.—యోబు 5:19; సామెతలు 30:15, 18, 21.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి