కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 87
  • క్రీస్తు విరోధి ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తు విరోధి ఎవరు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • క్రీస్తు విరోధులను ఎలా గుర్తుపట్టవచ్చు?
  • క్రీస్తు విరోధి ఎవరు?
    తేజరిల్లు!—2001
  • క్రీస్తువిరోధి నిజస్వరూపం బహిర్గతమైంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • క్రీస్తువిరోధిని ఎందుకు గుర్తించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 87
టీవీ ద్వారా ప్రకటించడం

క్రీస్తు విరోధి ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

క్రీస్తు విరోధి కేవలం ఒక వ్యక్తో లేదా ఒక సంస్థో కాదు. ఎందుకంటే “అనేకులైన క్రీస్తు విరోధులు” ఉన్నారని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:18) అయితే “క్రీస్తు విరోధి” అనే గ్రీకు పదానికి “క్రీస్తు వ్యతిరేకి (లేదా క్రీస్తుకు బదులు)” అని అర్థం. క్రీస్తు విరోధులు ఏమి చేస్తారంటే:

  • యేసే క్రీస్తని (మెస్సీయ) లేదా ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోరు.—1 యెహాను 2:22.

  • దేవుడు అభిషేకించిన క్రీస్తును వ్యతిరేకిస్తారు.—కీర్తన 2:1, 2; లూకా 11:23.

  • తామే క్రీస్తు అన్నట్లు నటిస్తారు.—మత్తయి 24:24.

  • క్రీస్తును అనుసరించేవాళ్లను హింసిస్తారు. అయితే తన అనుచరులను హింసిస్తే తననే హింసిస్తున్నట్లు యేసు భావిస్తాడు.—అపొస్తలుల కార్యములు 9:5.

  • దేవుని నియమాలు పాటించకుండా మోసాలు చేస్తూ పైకిమాత్రం తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు.—మత్తయి 7:22, 23; 2 కొరింథీయులు 11:13.

క్రీస్తు విరోధులు ఏమి చేస్తారో చెప్పడమే కాకుండా, అలాంటి వాళ్లందర్నీ బైబిలు “క్రీస్తు విరోధి” అని పిలుస్తోంది. (2 యోహాను 8) మొదటిసారిగా క్రీస్తు విరోధులు అపొస్తలుల కాలంలో కనిపించారు. అయితే వాళ్లు ఇప్పటివరకు చురుకుగా ఉన్నారు. ఇలా జరుగుతుందని బైబిలు ముందుగానే చెప్పింది.—1 యోహాను 4:3.

క్రీస్తు విరోధులను ఎలా గుర్తుపట్టవచ్చు?

  • వాళ్లు యేసు గురించిన తప్పుడు బోధలను ప్రచారం చేస్తారు. (మత్తయి 24:9, 11) ఉదాహరణకు, త్రిత్వం గురించి బోధించేవాళ్లు లేదా యేసు సర్వశక్తిగల దేవుడని చెప్పేవాళ్లు “తండ్రి నాకంటె గొప్పవాడు” అని చెప్పిన యేసు బోధల్ని వ్యతిరేకిస్తున్నట్లే.—యోహాను 14:28.

  • దేవుని రాజ్యం పనిచేసే విధానం గురించి యేసు చెప్పినదాన్ని క్రీస్తు విరోధులు ఒప్పుకోరు. ఉదాహరణకు, క్రీస్తు మానవ ప్రభుత్వాల ద్వారా పరిపాలిస్తున్నాడని కొంతమంది మతనాయకులు చెప్తారు. కానీ వాళ్లు చెప్తున్నదానికి, యేసు చెప్పినదానికి పొంతన కుదరడం లేదు. యేసు ఏమి చెప్పాడంటే, “నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.”—యోహాను 18:36.

  • యేసు తమ ప్రభువని చెప్పుకుంటారు కానీ రాజ్యసువార్తను ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞతో సహా ఏ ఆజ్ఞనూ వాళ్లు పాటించరు.—మత్తయి 28:19, 20; లూకా 6:46; అపొస్తలుల కార్యములు 10:42.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి