కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 80
  • మనం ఎప్పుడు చనిపోతామనేది ముందే రాసిపెట్టి ఉంటుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ఎప్పుడు చనిపోతామనేది ముందే రాసిపెట్టి ఉంటుందా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ప్రసంగి 3:11—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”
    బైబిలు వచనాల వివరణ
  • ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “మానవకోటికి ఇదియే విధి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 80
ఒక వ్యక్తిని ఆంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా అది గమనిస్తున్న రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి

మనం ఎప్పుడు చనిపోతామనేది ముందే రాసిపెట్టి ఉంటుందా?

బైబిలు ఇచ్చే జవాబు

లేదు. మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేది ముందే రాసిపెట్టి ఉండదు. తలరాత నిజమని బైబిలు చెప్పట్లేదు కానీ సాధారణంగా మరణం అనుకోని సంఘటనలవల్ల జరుగుతుందని చెప్తుంది.—ప్రసంగి 9:11.

చనిపోవడానికి ఒక సమయం ఉందని బైబిలు చెప్తుందా?

అవును. “పుట్టుటకు చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు” సమయం ఉందని ప్రసంగి 3:2 చెప్తుంది. ఈ వచనాన్ని రాసిన సందర్భాన్ని చూస్తే, మన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దశల గురించి బైబిలు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. (ప్రసంగి 3:1-8) ఫలానా సమయంలోనే మొక్క నాటాలని దేవుడు ఓ రైతుని బలవంత పెట్టనట్టే, మనం ఫలానా సమయంలో చనిపోవాలని ముందే రాసిపెట్టలేదు. బదులుగా, అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మన సృష్టికర్తను పట్టించుకోనంతగా అనవసరమైన విషయాల్లో మునిగిపోకూడదు.—ప్రసంగి 3:11, 12; 12:1, 13.

ఎక్కువకాలం జీవించగలం

ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియకపోయినా, తెలివైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువకాలం జీవించగలుగుతాం. “జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 13:14) అదేవిధంగా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తే ‘దీర్ఘాయుష్మంతులు’ అవుతారని మోషే ప్రాచీనకాలంలోని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 6:2) దానికి భిన్నంగా, మనం చెడ్డగా జీవిస్తే లేదా తెలివితక్కువ పనులు చేస్తే త్వరగా చనిపోయే అవకాశం ఉంది.—ప్రసంగి 7:17.

మనం ఎంత తెలివిగా లేదా జాగ్రత్తగా ఉన్నా మరణాన్ని తప్పించుకోలేం. (రోమీయులు 5:12) కానీ ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు, ‘మరణము ఇక ఉండని’ కాలం వస్తుందని బైబిలు మాటిస్తుంది.—ప్రకటన 21:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి