కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 72
  • ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ప్రకటన గ్రంథపు ధన్యులైన పాఠకులై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన 21:1—‘కొత్త ఆకాశం, కొత్త భూమి’
    బైబిలు వచనాల వివరణ
  • త్వరలో సంభవింపనైయున్న సంగతులు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 72
అపోకలిప్స్‌లోని క్రూరమృగాన్ని, గుర్రపు రౌతుల్ని ఊహించుకుంటూ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తి

ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లోని ప్రకటన గ్రంథానికి గ్రీకులో, అపోకలిప్స్‌ అని పేరు. దానికి, “ముసుగు తీయడం” లేదా “వెల్లడించడం” అని అర్థం. ఆ పేరులోనే, ప్రకటన గ్రంథానికున్న అర్థమేమిటో తెలుస్తుంది. అదేంటంటే, కొంతకాలంగా రహస్యంగా ఉన్న వాటిపై ముసుగును అది తీసేస్తుంది, చాలాకాలం తర్వాత జరగబోయే సంఘటనలను అది వెల్లడిచేస్తుంది. ప్రకటన గ్రంథంలోని చాలా ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నాయి.

ప్రకటన గ్రంథంలో ఏమున్నాయి

  • ముందుమాట.—ప్రకటన 1:1-9.

  • ఏడు సంఘాలకు యేసు చెప్పిన సందేశం.—ప్రకటన 1:10-3:22.

  • పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని దర్శనం.—ప్రకటన 4:1-11.

  • వరుస దర్శనాలు, ప్రతీ దర్శనం తర్వాతి దానికి ముడిపడి ఉంటుంది.

    • ఏడు ముద్రలు.—ప్రకటన 5:1-8:6.

    • ఏడు బూరలు. చివరి మూడు, మూడు శ్రమల్ని తీసుకొస్తాయి.—ప్రకటన 8:7-14:20.

    • ఏడు పాత్రలు. భూమ్మీద కుమ్మరించే ఈ పాత్రల్లోని ప్రతీదానిలో దేవుని తీర్పును సూచించే తెగుళ్లు ఉంటాయి.—ప్రకటన 15:1-16:21.

    • దేవుని శత్రువుల నాశనానికి సంబంధించిన దర్శనాలు.—ప్రకటన 17:1-20:10.

    • దేవుడు పరలోకానికి, భూమికి ఇచ్చే ఆశీర్వాదాలకు సంబంధించిన దర్శనాలు.—ప్రకటన 20:11-22:5.

  • ముగింపు.—ప్రకటన 22:6-21.

ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసే విషయాలు

  1. ఈ పుస్తకంలోని అర్థం మంచిది, దేవుని సేవకులను భయపెట్టేది కాదు, బెదిరించేది కాదు. చాలామంది “అపోకలిప్స్‌” అనే పదాన్ని సర్వనాశనంతో ముడిపెడతారు, కానీ ప్రకటన గ్రంథంలోని సందేశాన్ని చదివి, అర్థం చేసుకుని, పాటించినవాళ్లు సంతోషంగా ఉంటారన్న మాటలే ఆ పుస్తకం మొదట్లోనూ, చివర్లోనూ ఉన్నాయి.—ప్రకటన 1:3; 22:7.

  2. ప్రకటన గ్రంథంలో ఎన్నో ‘సూచనలు,’ గుర్తులు ఉన్నాయి, అవి వేటిని సూచిస్తున్నాయో తెలుసుకుని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.—ప్రకటన 1:1.

  3. ప్రకటన గ్రంథంలోని ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల్ని, గుర్తుల్ని దానికి ముందున్న పుస్తకాలే పరిచయం చేసేశాయి:

    • యెహోవా—‘పరలోకంలో ఉన్న నిజమైన దేవుడు,’ అన్నిటికీ సృష్టికర్త.—ద్వితీయోపదేశకాండము 4:39, NW; కీర్తన 103:19; ప్రకటన 4:11; 15:3.

    • యేసుక్రీస్తు—“దేవుని గొర్రెపిల్ల.”—యోహాను 1:29; ప్రకటన 5:6; 14:1.

    • అపవాదియైన సాతాను—దేవుని శత్రువు.—ఆదికాండము 3:14, 15; యోహాను 8:44; ప్రకటన 12:9.

    • మహాబబులోను—ప్రాచీన బబులోను (బాబెలు) పట్టణంలా యెహోవా దేవునికి, ఆయన ప్రజలకు శత్రువు; దేవుని గురించిన అబద్ధాలకు పుట్టిల్లు.—ఆదికాండము 11:2-9; యెషయా 13:1, 11; ప్రకటన 17:4-6; 18:4, 20.

    • “సముద్రము”—దేవుణ్ణి ఎదిరించిన చెడ్డ ప్రజలు.—యెషయా 57:20; ప్రకటన 13:1; 21:1.

    • పూర్వం దేవుని ఆరాధన కోసం ఉపయోగించిన ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవి—నిబంధన మందసం, గాజువంటి సముద్రం (గంగాళం), దీపములు, ధూపార్పణలు, బలిపీఠం మొదలైనవి.—నిర్గమకాండము 25:10, 17, 18; 40:24-32; ప్రకటన 4:5, 6; 5:8; 8:3; 11:19.

    • క్రూరమృగాలు—మానవ ప్రభుత్వాలకు చిహ్నాలు.—దానియేలు 7:1-8, 17-26; ప్రకటన 13:2, 11; 17:3.

    • గుర్తులుగా వాడిన సంఖ్యలు.—ప్రకటన 1:20; 8:13; 13:18; 21:16.

  4. దర్శనాలు అన్నీ ‘ప్రభువు దినానికి’ సంబంధించినవి. ఆ “ప్రభువు దినం,” 1914లో దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు, రాజుగా యేసు పరిపాలన ప్రారంభించినప్పుడు మొదలైంది. (ప్రకటన 1:10) అంటే ప్రకటన గ్రంథంలోని విషయాల అసలైన నెరవేర్పు మన కాలంలోనే జరుగుతుందని మనం ఆశించవచ్చు.

  5. మనం బైబిలును అర్థం చేసుకోవాలంటే మనకు దేవుడు ఇచ్చే జ్ఞానం కావాలి, దాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నవాళ్లు మనకు సహాయం చేయాలి. అలాగే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అవే అవసరం.—అపొస్తలుల కార్యములు 8:26-39; యాకోబు 1:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి