కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 27
  • నాకు స్నేహితులు ఎందుకు లేరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాకు స్నేహితులు ఎందుకు లేరు?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరితనం గురించి క్విజ్‌
  • స్నేహం, ఒంటరితనం గురించిన నిజాలు
  • ఈ పోరాటంలో గెలిచేదెలా?
  • ఒంటరితనం మీ జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఒంటరితనం—మనస్సులో దాగిన వ్యధ
    తేజరిల్లు!—1994
  • యువత ఒంటరితనంతో బాధపడుతుంటే
    తేజరిల్లు!—2015
  • ఒంటరితనం—దీనితో పోరాడి విజయం సాధించాలని నీవు నిశ్చయించుకున్నావా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 27
ఒంటరితనంతో బాధపడుతున్న ఒక టీనేజీ అమ్మాయి

యువత అడిగే ప్రశ్నలు

నాకు స్నేహితులు ఎందుకు లేరు?

మీరు ఇంటర్నెట్‌లో, ఈ మధ్యే జరిగిన ఒక పార్టీ ఫొటోలు చూస్తున్నారు. ఆ పార్టీలో మీ ఫ్రెండ్స్‌ అందరూ ఉన్నారు, వాళ్లు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ ఏదో తగ్గింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అక్కడ ఒక వ్యక్తి తగ్గారు, అది … మీరే!

‘నన్నెందుకు పిలవలేదు?’ అని మీకు అనిపించింది.

మీ కుతూహలం కోపంగా మారింది. వాళ్లు ద్రోహం చేశారని మీకు అనిపించింది. వాళ్లతో మీకున్న బంధాలన్నీ పేక మేడలా కూలిపోయాయా అనిపించింది. ఒంటరితనం మిమ్మల్ని కమ్మేసి, మీ మనసులో ఓ ప్రశ్న మెదిలింది, ‘నాకు ఫ్రెండ్స్‌ ఎందుకు లేరు?’

  • ఒంటరితనం గురించిన క్విజ్‌

  • స్నేహం, ఒంటరితనం గురించిన నిజాలు

  • ఈ పోరాటంలో గెలిచేదెలా?

  • మీ తోటివాళ్లు ఏమంటున్నారు?

  • స్నేహానికి సంబంధించిన భయాల్ని అధిగమించడం

ఒంటరితనం గురించి క్విజ్‌

అవునా, కాదా?

  1. మీకు చాలామంది ఫ్రెండ్స్‌ ఉంటే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  2. మీరు ఒక సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయితే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  3. మీరు మెసేజ్‌లు ఎక్కువగా పంపిస్తూ ఉంటే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  4. మీరు వేరే వాళ్లకోసం ఏదైనా పని చేస్తే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

ఈ నాలుగు వాక్యాలకూ, ‘కాదు’ అనేదే జవాబు.

ఎందుకు?

స్నేహం, ఒంటరితనం గురించిన నిజాలు

  • చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

    “నేను నా ఫ్రెండ్స్‌ని పట్టించుకుంటాను, అయినా వాళ్లు నన్ను పట్టించుకోవట్లేదని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మీ చుట్టూ ఫ్రెండ్స్‌ ఉండి, వాళ్లు మిమ్మల్ని ప్రేమించకపోతే, మీరు అక్కర్లేదన్నట్లు వాళ్లు ప్రవర్తిస్తే అంతకంటే ఘోరమైన ఒంటరితనం ఇంకొకటి ఉండదు.”—ఆన్‌.

  • ఒక సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయినంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

    “కొంతమంది బొమ్మల్ని పోగేసుకున్నట్లు, ఫ్రెండ్స్‌ని పోగేసుకుంటారు. కానీ అలా పోగేసుకున్న ఫ్రెండ్స్‌ బోలెడంతమంది ఉన్నా, ప్రేమించేవాళ్లు ఉన్నారనే ఫీలింగ్‌ రాదు. మంచి స్నేహబంధం లేకపోతే ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ అందరూ ప్రాణం లేని బొమ్మలతో సమానం.”—ఇలాన్‌.

  • మెసేజ్‌లు ఎక్కువగా పంపిస్తూ ఉన్నంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

    “మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు, మీ ఫ్రెండ్స్‌ ఎవరైనా మెసేజ్‌ పంపారేమోనని ఫోన్‌ చూసుకుంటూ ఉంటారు. మీరు అసలే ఒంటరితనంతో బాధపడుతున్నారు, తీరా ఫోన్‌ చూశాక, మీతో మాట్లాడడానికి కనీసం ఒక్కరు కూడా ట్రై చేయలేదని తెలుస్తుంది, అప్పుడు మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.”—సరీన.

  • వేరేవాళ్ల కోసం ఏదైనా పని చేసినంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

    “నేను నా ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ వాళ్లు నాతో అలా ఉండడం లేదు. నేను వాళ్లతో దయగా ఉన్నందుకు నేను బాధపడట్లేదు, కానీ వాళ్లు నాతో ఎప్పుడూ దయగా ఉండకపోవడం చూసి నాకు బాధగా అనిపిస్తుంది.”—రిచర్డ్‌.

ఒక్కమాటలో: ఒంటరితనం అనేది ఒక మానసిక వైఖరి. “అది మనిషి మనసులో ఏర్పడుతుందే గానీ అతని చుట్టూ ఏర్పడదు.” అని జనెట్‌ అనే యువతి అంటోంది.

మీకు ఫ్రెండ్స్‌ లేరని, ఒంటరివాళ్లు అయిపోయారని మీకు అనిపిస్తే మీరు ఏమి చేయాలి?

ఈ పోరాటంలో గెలిచేదెలా?

ఆత్మవిశ్వాసం లేక బాధపడుతున్న ఒక టీనేజీ అమ్మాయి

ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.

“అభద్రతా భావాల వల్ల ఒంటరితనం కలుగుతుంది. మీరు ఎదుటివాళ్లు ఇష్టపడేంత గొప్ప వ్యక్తి కాదని మీరనుకుంటే, మీరు ఎవరికీ దగ్గరవ్వలేరు, ఎవరితోనూ స్నేహం చేయలేరు.”—జనెట్‌.

బైబిలు ఇలా చెప్తోంది: “నిన్ను వలె [నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే, NW] నీ పొరుగువానిని ప్రేమించుము.” (గలతీయులు 5:14) మంచి స్నేహాన్ని ఎంజాయ్‌ చేయాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, అలాగని స్వార్థంతో కూడిన గర్వాన్ని పెంచుకోకూడదు.—గలతీయులు 6:3, 4.

తన మీద తాను జాలిపడుతున్న ఒక టీనేజీ అబ్బాయి

మీ మీద మీరు జాలిపడకడి.

“ఒంటరితనం ఊబి లాంటిది, మీరు అందులో పడి కొట్టుకునేకొద్దీ లోతుకు వెళ్లిపోతూ ఉంటారు. మీరు మీ గురించే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే, మీ మీద జాలిపడడానికి మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు.”—ఎరిన్‌

బైబిలు ఇలా చెప్తోంది: “ప్రేమ … స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:4, 5) నిజమేంటంటే, మనం మన గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకుంటుంటే, మనలో కరుణ తగ్గిపోతుంది, అప్పుడు మనతో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. (2 కొరింథీయులు 12:15) ఒకటి మాత్రం నిజం: మీ గెలుపును ఎదుటివాళ్ల ప్రవర్తన ఆధారంగా నిర్ణయించుకుంటే మీరు తప్పకుండా ఓడిపోతారు! “నన్నెవరూ పిలవరు,” “నన్ను ఎవరూ ఎక్కడికీ ఆహ్వానించరు” అనే మాటలు మీ సంతోషాన్ని ఎదుటివాళ్ల చేతుల్లో పెట్టేస్తాయి. అంటే మీరు వాళ్లకు కాస్త ఎక్కువ అధికారం ఇచ్చేస్తున్నట్లే కదా?

ఒక టీనేజీ అబ్బాయి సిగరెట్‌ వద్దంటున్నాడు

ఎవరితో పడితే వాళ్లతో స్నేహ చేయకడి.

“ఒంటరితనంతో బాధపడేవాళ్లు, తమను పట్టించుకునేవాళ్ల కోసం చూస్తారు, అలా ఒక్కోసారి వాళ్లు తమను పట్టించుకునేవాళ్లు ఎలాంటివాళ్లైనా ఫర్లేదనే పరిస్థితికి వచ్చేస్తారు. తమను కావాలనుకునే వాళ్లు ఉన్నారన్న ఫీలింగ్‌ వాళ్లకు ఇష్టం. కానీ కొంతమంది మీరు తమకు ముఖ్యమైనవాళ్లన్న ఫీలింగ్‌ మీకు కలిగించి, మిమ్మల్ని వాడేసుకుంటారు. అప్పుడు మీ ఒంటరితనం మరీ ఘోరంగా ఉంటుంది.”—బ్రీయాన్‌.

బైబిలు ఇలా చెప్తోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) బాగా ఆకలితో ఉన్నవాళ్లు ఏది పడితే అది తినేస్తారు. అలాగే, ఫ్రెండ్స్‌ కరువైనవాళ్లు ఫ్రెండ్స్‌ కోసం తప్పుడు ప్రదేశాలన్నీ వెదుకుతారు. అలాంటి సంబంధాలు మామూలేనని, తమకు అంతకంటే మంచివి దొరకవని అనుకుంటూ వాళ్లు సులువుగా మోసగాళ్ల వలలో పడిపోతారు.

చివరిమాట: ప్రతీ ఒక్కరు ఏదోక సమయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తారు; కాకపోతే కొంతమంది ఒంటరితనంతో మరీ ఎక్కువ బాధపడతారు. ఒంటరితనం అనేది నిజంగా చాలా బాధాకరమైన ఫీలింగే, కానీ అది ఒక ఫీలింగ్‌ మాత్రమే. మన ఆలోచనల వల్లే ఫీలింగ్‌ అనేది కలుగుతుంది, మన ఆలోచనలను మనం కంట్రోల్‌ చేసుకోగలం.

ఎదుటివాళ్ల నుండి మరీ ఎక్కువ ఆశించకండి. “ప్రతీ ఒక్కరూ మీకు చిరకాల సన్నిహిత మిత్రులు అయిపోరు,” అంటోంది పైన చెప్పిన జనెట్‌. తను ఇంకా ఇలా చెప్తోంది: “కానీ మిమ్మల్ని పట్టిచుకునేవాళ్లు మీకు తప్పకుండా దొరుకుతారు. అలా పట్టించుకుంటే చాలు, అదే ఒంటరితనాన్ని దూరం చేసేస్తుంది.”

మరింత సహాయం కావాలా? “స్నేహం గురించి మీకున్న భయాల్ని అధిగమించండి” అనే భాగాన్ని చదవండి. ఇంకా, “ఒంటరితనాన్ని ఓడించండి” అనే వర్క్‌షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

మీ వయసువాళ్లు ఏమటున్నారు?

వనిస్స

“మీ ఒంటరితనం గురించి ఎవరితోనైనా మాట్లాడండి. మీ ఫీలింగ్స్‌ని దాచేయకండి. మీకు తెలిసినవాళ్లలో, మీలానే ఫీల్‌ అయ్యేవాళ్లు కొంతమంది ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీకు కావాల్సిందల్లా, మీ మనసును తేలికచేసే ఒక ఫ్రెండ్‌, అంతే.”—వనిస్స.

టేలర్‌

“మీ ఒంటరితనానికి మీరు ప్రతీసారీ ఎదుటివాళ్లను నిందించడం సరికాదు. కొన్నిసార్లు మీరే మిగతావాళ్లకు దూరంగా ఉంటారు. కాబట్టి, మళ్లీ అందరితో కలవడానికి మీరు చేయగలిగింది చేయండి. అది కుదరకపోతే, మీరు ఇంతకు ముందెప్పుడూ స్నేహం చేయని కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ప్రయత్నించండి.”—టేలర్‌.

స్నేహం గురించి మీకున్న భయాల్ని అధిగమించండి

“నా స్నేహితురాలు ఒకామె, ఒంటరితనంతో తీవ్రంగా బాధపడుతోంది. తనను పట్టించుకునేవాళ్లు తన చుట్టూ ఉన్నా, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని, ప్రేమించట్లేదని అనుకుంటుంది. తాను పనికిరానిదాన్ననే ఫీలింగ్‌ని కనపడనీయకుండా పైకి గంభీరంగా ఉన్నట్టు నటిస్తుంది. అలా ఉండడానికి తను చేసే ప్రయత్నాల వల్ల, తను ఎవరితోనూ స్నేహం చేయలేకపోతుందని నాకు అనిపిస్తుంది. తనను కలిసేవాళ్లు తను స్నేహపూర్వకంగా ఉండదనుకుంటారు, దాంతో కొంతమంది తనతో స్నేహం చేయడానికి భయపడతారు.

“నా స్నేహితురాలు, స్నేహం వల్ల తను బాధపడే పరిస్థితి వస్తుందేమోనని బాగా వర్రీ అవుతుంది. అందుకే తనను తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వాళ్లకు చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయేమోనని లేదా వాళ్లతో స్నేహం చెడిపోతుందేమోనని అనుకుంటుంది. తను చాలామందికి అర్థం కాకపోవడం వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తోంది, నిజానికి తన ఫీలింగ్స్‌ని ఎదుటివాళ్లకు చెప్పడానికి తనే ఇష్టపడదు.

“కొన్నికొన్ని విషయాలు ఎదుటివాళ్లతో చెప్పుకోవడం వల్ల బంధం బలపడుతుందని, ఎదుటివాళ్లు తనని బాగా అర్థం చేసుకోగలుగుతారని నా ఫ్రెండ్‌ గుర్తించాలి. తాను కోరుకున్నట్లు వాళ్లు తనతో స్నేహం చేయడానికి, ఆ విషయాలు వాళ్లకు ఉపయోగపడతాయి. ఎప్పటికైనా నా ఫ్రెండ్‌కు బాగౌతుందని, స్నేహం గురించి తనకున్న భయాల్ని అధిగమించడం నేర్చుకుంటుందని ఆశిస్తున్నాను.”—ఇలాన్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి