కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 66
  • నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • నరకానికి ఎవరు వెళ్తారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నరకాగ్నికి ఏమయ్యింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • వాస్తవానికి నరకం అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సర్వత్రా వ్యాపించివున్న నమ్మకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 66
Religious artwork showing people suffering in a fiery hell.

నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?

బైబిలు ఇచ్చే జవాబు

కొన్ని బైబిలు అనువాదాలు “షియోల్‌” అనే హీబ్రూ పదాన్ని, “హెడిస్‌” అనే గ్రీకు పదాన్ని “నరకం” అని అనువదించాయి. ఆ రెండు పదాలు మానవజాతి సామాన్య సమాధిని సూచిస్తున్నాయి. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 2:27) చాలామంది ప్రజలు నరకం అంటే, పక్కన ఉన్న చిత్రంలో చూపించినట్లుగా ఉంటుందని నమ్ముతారు. కానీ బైబిలు అలా బోధించడం లేదు.

  1. నరకంలో ఉన్నవాళ్లకు ఏమీ తెలీదు, కాబట్టి వాళ్లు బాధను అనుభవించలేరు. “పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:10.

  2. మంచివాళ్లు నరకానికి వెళ్తారు. నమ్మకమైన సేవకులైన యాకోబు, యోబు అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు.—ఆదికాండము 37:35; యోబు 14:13.

  3. పాపానికి శిక్ష మరణమేగానీ, నరకాగ్నిలో హింసించబడడం కాదు. “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది యున్నాడు.”—రోమీయులు 6:7.

  4. నిత్యమూ బాధించడమనేది దేవుని న్యాయానికి విరుద్ధమైనది. (ద్వితీయోపదేశకాండము 32:4) మొదటి మానవుడైన ఆదాము తప్పు చేసినప్పుడు, అతను ఉనికిలో లేకుండా పోతాడని దేవుడు చెప్పాడు. దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు, “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:19) ఒకవేళ దేవుడు నిజంగా ఆదామును నరకానికి పంపించివుంటే, దేవుడు అబద్ధం చెప్పినట్లు అయ్యుండేది.

  5. నరకంలో బాధించాలని దేవుడు కనీసం ఊహించడు కూడా. దేవుడు ప్రజల్ని నరకంలో శిక్షిస్తాడనే ఆలోచన బైబిలు చెప్తున్నదానికి విరుద్ధంగా ఉంది. బైబిలు ఇలా చెప్తుంది, “దేవుడు ప్రేమాస్వరూపి.”—1 యోహాను 4:8; యిర్మీయా 7:31.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి