కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 58
  • లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • అనైతిక లోకంలో మీరు పవిత్రంగా ఉండగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 58

లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్పట్లేదుగానీ, అది పెళ్లైనవాళ్లకు దేవుడిచ్చిన ఓ బహుమానం అని చెప్తుంది. దేవుడు మనషుల్ని “స్త్రీనిగాను పురుషునిగాను” సృష్టించి, తాను చేసినదంతా “చాలమంచిదిగ” ఉందని భావించాడు. (ఆదికాండము 1:27, 31) దేవుడు మొదటి స్త్రీపురుషుల్ని వివాహంలో జతచేసినప్పుడు, “వారు ఏక శరీరమైయుందురు” అని అన్నాడు. (ఆదికాండము 2:24) అంటే, వాళ్లిద్దరూ లైంగిక ఆనందాన్ని పొందుతూ, ఒకరి భావోద్వేగ అవసరాలు మరొకరు తీర్చుకోవాలి.

భర్త తన భార్య దగ్గర పొందే ఆనందాన్ని బైబిలు ఇలా వర్ణిస్తుంది: “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ... ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.” (సామెతలు 5:18, 19) భార్య కూడా లైంగిక ఆనందాన్ని పొందే విధంగా దేవుడు సృష్టించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.”—1 కొరింథీయులు 7:3.

లైంగిక ఆనందానికి హద్దులు ఉన్నాయి

లైంగిక సంబంధాలు భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే హెబ్రీయులు 13:4 ఇలా చెప్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” భార్యభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి, అలాగే వాళ్లు చేసుకున్న ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్లు తమ సొంత కోరికల్ని తీర్చుకోవడం ద్వారా కాదుగానీ బైబిల్లోని ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా మరింత ఆనందం పొందుతారు. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి