కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 52
  • జీవితానికి అర్థం ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవితానికి అర్థం ఏంటి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • దేవుడు మనల్ని ఎందుకు చేశాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • జీవితానికి ఏది నిజమైన అర్థాన్నిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • అర్థవంతమైన సంకల్పంతో జీవించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 52

జీవితానికి అర్థం ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

‘జీవితానికి అర్థం ఏంటి?’ ఇదే ప్రశ్నను, ‘మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం?’ అని లేదా ‘నా జీవిత ఉద్దేశం ఏంటి?’ అని కూడా అడగవచ్చు. దానికి జవాబుగా, దేవునితో స్నేహం పెంచుకోవడమే మన జీవితానికి ఉన్న ఉద్దేశం అని బైబిలు చెప్తుంది. బైబిలు చెప్తున్న ఈ ప్రాముఖ్యమైన సత్యాలను గమనించండి.

  • మనల్ని దేవుడు సృష్టించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆయనే [దేవుడే] మనలను పుట్టించెను మనము ఆయన వారము.”—కీర్తన 100:3; ప్రకటన 4:10,11.

  • మనల్ని, అలాగే తను సృష్టించిన ప్రతీ దాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు.—యెషయా 45:18.

  • మన ‘ఆధ్యాత్మిక అవసరాన్ని’ గుర్తించే విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. మన జీవితానికున్న అర్థాన్ని తెలుసుకోవడం కూడా అందులో భాగమే. (మత్తయి 5:3, NW) ఆ కోరికను తీర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు.—కీర్తన 145:16.

  • దేవునితో స్నేహం చేయడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకుంటాం. అది నిజంగా జరిగే పని కాదని కొంతమంది అనుకున్నా, బైబిలు ఇలా ప్రోత్సహిస్తుంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8; 2:23.

  • దేవునికి స్నేహితులవ్వాలంటే, మన గురించి ఆయన ఉద్దేశించిన దానికి తగ్గట్టు మనం జీవించాలి. ఆ ఉద్దేశాన్ని బైబిల్లో ప్రసంగి 12:13 లో చూడవచ్చు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”

  • త్వరలో దేవుడు చెడుతనాన్ని తీసేసి, తనకు నమ్మకంగా ఉన్న, తనను ఆరాధించేవాళ్లకు చావులేని జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు, దేవుడు నిజంగా మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడో అర్థంచేసుకుంటాం.—కీర్తన 37:10, 11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి