కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 28
  • యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • యోహాను 14:6—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”
    బైబిలు వచనాల వివరణ
  • మనం యేసుకు ప్రార్థన చేయవచ్చా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మీరు యేసుకు ప్రార్థన చేయాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట: మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 28

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

బైబిలు ఇచ్చే జవాబు

మనం యేసు పేరిట దేవునికి ప్రార్థించాలి. ఎందుకంటే మనం తనకు దగ్గరవడానికి దేవుడు ఆమోదించిన మార్గం అదొక్కటే. యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని చెప్పాడు. (యోహాను 14:6) “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని కూడా యేసు తన నమ్మకమైన అపొస్తలులకు చెప్పాడు.—యోహాను 16:23.

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలనేదానికి మరికొన్ని కారణాలు

  • మనం యేసును, ఆయన తండ్రైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తాం.—ఫిలిప్పీయులు 2:9-11.

  • యేసు మరణం, మనల్ని రక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటని, దాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తాం.—మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 4:12.

  • దేవునికి, మనుషులకు మధ్యవర్తిగా యేసుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తిస్తాం.—హెబ్రీయులు 7:25.

  • మనం దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి, యేసు ఓ ప్రధాన యాజకునిగా మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే ఈ సేవను మనం గౌరవిస్తాం.—హెబ్రీయులు 4:14-16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి