కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 97
  • ఎందుకింత ద్వేషం?—బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకింత ద్వేషం?—బైబిలు ఏం చెప్తుంది?
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ద్వేషం​—మన కాలానికి ఒక గుర్తు
  • ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ద్వేషం వల్ల జరిగే దారుణాలు ఆగుతాయా?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 97
ఒక కార్టూన్‌ బొమ్మ మాట్లాడుతుంది. ఆ మాటలు ఎదుటి వ్యక్తికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి.

id-work/DigitalVision Vectors via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

ఎందుకింత ద్వేషం?—బైబిలు ఏం చెప్తుంది?

ద్వేషంతో నిండిపోయిన మాటలు, నేరాలు, హింస, యుద్ధాలతోనే వార్తలు రాజ్యమేలుతున్నాయి.

  • “గాజా-ఇజ్రాయెల్‌ మధ్య జరిగే యుద్ధం అలాగే తీవ్రవాదులు రెచ్చగొట్టడం వల్ల సోషల్‌ మీడియాలో, ద్వేషంతో నిండిపోయిన మాటలు ఇంకా ఎక్కువ హల్‌చల్‌ చేస్తున్నాయి.”​—ది న్యూయార్క్‌ టైమ్స్‌, 2023, నవంబరు 15.

  • “అక్టోబరు 7 తర్వాత నుండి ద్వేషంతో నిండిపోయిన మాటలు, నేరాలు అలాగే వాటి గురించి ఆందోళన ప్రపంచంలో అంచెలంచెలుగా పెరిగిపోయాయి.”​—డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌, 2023 నవంబరు 3,.

ద్వేషంతో నిండిపోయిన మాటలు, హింస, యుద్ధాలు కొత్త ఏమి కాదు. నిజానికి గతంలో కూడా “కఠినమైన మాటల్ని బాణాల్లా” ఎక్కుపెట్టిన వాళ్లు, యుద్ధాలు చేసిన వాళ్లు, హింసించిన వాళ్లు ఉన్నారని బైబిలు వివరిస్తుంది. (కీర్తన 64:3; 120:7; 140:1) కానీ ఇప్పుడు మనం చూస్తున్న ద్వేషానికి ఎంతో ప్రాముఖ్యమైన అర్థం ఉందని బైబిలు చెప్తుంది.

ద్వేషం​—మన కాలానికి ఒక గుర్తు

ఈరోజుల్లో ద్వేషం ఎందుకంత సాధారణం అయిపోయిందో బైబిలు రెండు కారణాలు చెప్తుంది.

  1. 1. బైబిలు ఆ సమయం గురించి ముందే చెప్పింది అప్పుడు “ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.” (మత్తయి 24:12) ప్రేమ బదులు ప్రజలు ద్వేషాన్ని, దాని లక్షణాలను చూపిస్తున్నారు.​—2 తిమోతి 3:1-5.

  2. 2. ఇప్పుడు పెరుగుతున్న ద్వేషం వెనక అపవాదియైన సాతాను హానికరమైన, దుష్ట ప్రభావం ఉంది. “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని బైబిలు చెప్తుంది.​—1 యోహాను 5:19; ప్రకటన 12:9, 12.

అంతేకాదు దేవుడు ద్వేషాన్ని వేళ్లతో సహా తీసేస్తాడని బైబిలు చెప్తుంది. అంతకుమించి, ఆయన మనకు ద్వేషం వల్ల వచ్చిన నొప్పిని తీసేస్తాడు. బైబిలు ఇలా మాటిస్తోంది:

  • ‘దేవుడు వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.’​—ప్రకటన 21:4

“ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం.”అనే కావలికోట పత్రికను చదవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దానిలో ఈ క్రింది ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు ఉన్నాయి:

ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?

ద్వేషం నుండి ఎలా బయటపడవచ్చు?

ద్వేషాన్ని లేకుండా చేయడానికి దేవుడు ఏం చేస్తాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి