కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 38
  • మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడా?
  • మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారా?
  • ఈ రోజుల్లో క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు
  • మతనాయకులు రాజకీయాలు ప్రబోధించాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘వారు లోకసంబంధులు కారు’
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ‘వారు లోకసంబంధులు కారు’
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 38
ఒక రాజకీయ నాయకుడు, మత నాయకుడు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసి ప్రజలకు చెయ్యి ఊపుతున్నారు.

మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?

ప్రపంచవ్యాప్తంగా, యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునే ఎంతోమంది రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. వాళ్లు ఆయా అభ్యర్థులకు లేదా రాజకీయ పార్టీలకు మద్దతివ్వడం ద్వారా రాజకీయ, నైతిక విషయాల్లో తమ నమ్మకాల్ని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు తరచూ నైతిక లేదా సామాజిక సమస్యల్ని వాడుకొని మతనాయకుల మద్దతు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు, మతనాయకులు రాజకీయ పదవుల కోసం పోటీ చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది. కొన్ని దేశాల్లో అయితే, ఒక “క్రైస్తవమత” శాఖ రాష్ట్ర లేదా జాతీయ మతంగా ప్రత్యేక హోదాను పొందడం కూడా జరుగుతుంది.

మీకు ఏమనిపిస్తుంది? యేసుక్రీస్తును అనుసరించేవాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా? యేసు ఉదాహరణను పరిశీలిస్తే మనం ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవచ్చు. ఆయన ఇలా చెప్పాడు: “నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.” (యోహాను 13:15) ఇంతకీ రాజకీయాల విషయంలో యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

యేసు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడా?

లేదు. లోక రాజకీయాల్లో యేసు జోక్యం చేసుకోలేదు.

యేసు రాజకీయ పదవుల్ని ఆశించలేదు. అపవాది అయిన సాతాను ఈ “లోక ​రాజ్యాలన్నిటినీ” యేసుకు ఇస్తానని చెప్పినప్పుడు, మానవ ప్రభుత్వాల మీద పరిపాలకుడిగా ఉండడానికి యేసు ఒప్పుకోలేదు. (మత్తయి 4:8-10)a మరో సందర్భంలో ప్రజలు, ఒక మంచి నాయకునికి ఉండాల్సిన లక్షణాలు యేసుకు ఉన్నాయని గుర్తించి ఆయన్ని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నించారు. “వాళ్లు తన దగ్గరికి వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే మళ్లీ కొండకు వెళ్లిపోయాడు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 6:15) ప్రజల ఇష్టానికి యేసు లొంగిపోలేదు. బదులుగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించాడు.

రాజకీయ వివాదాల్లో యేసు తలదూర్చలేదు. ఒక ఉదాహరణ గమనించండి. యేసు కాలంలో యూదులు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టడానికి అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు, అది అన్యాయం అనుకునేవాళ్లు. ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పమని యేసును అడిగినప్పుడు, పన్ను కట్టడం న్యాయమా కాదా అనే రాజకీయ గొడవలోకి ఆయన దిగలేదు. ఆయన ఇలా చెప్పాడు: “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.” (మార్కు 12:13-17) ఆ రాజకీయ వివాదంలో ఆయన తలదూర్చలేదు. బదులుగా, కైసరును సూచిస్తున్న రోమా పౌరసంబంధ అధికారం కోరుతున్నట్టు పన్ను కట్టాలని చెప్పాడు. అదే సమయంలో, లోక అధికారులకు చూపించే విధేయతకు హద్దులు ఉన్నాయని కూడా చెప్పాడు. దేవునికి మాత్రమే చెందాల్సిన భక్తి, ఆరాధన లాంటి వాటిని ప్రభుత్వానికి ఇవ్వకూడదు.—మత్తయి 4:10; 22:37, 38.

పరలోక ప్రభుత్వం లేదా దేవుని రాజ్యం గురించి యేసు బోధించాడు. (లూకా 4:43) యేసు రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోలేదంటే, మానవ ప్రభుత్వాలు కాదుగానీ దేవుని రాజ్యమే భూమిని దేవుని ఇష్టానికి తగినట్టు మారుస్తుందని ఆయనకు తెలుసు. (మత్తయి 6:10) దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాల్ని ఉపయోగించుకోదని, వాటిని తీసేసి వాటి స్థానంలో పరిపాలిస్తుందని ఆయన అర్థంచేసుకున్నాడు.—దానియేలు 2:44.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారా?

లేదు. “మీరు లోకానికి చెందినవాళ్లు కాదు” అని అంటూ యేసు ఇచ్చిన ఆజ్ఞను ఆయన అనుచరులు పాటించారు. (యోహాను 15:19) ఆయన ఆదర్శాన్ని పాటిస్తూ వాళ్లు లోక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. (యోహాను 17:16; 18:36) వాళ్లు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకునే బదులు యేసు ఆజ్ఞాపించిన పని చేశారు, అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, బోధించారు.—మత్తయి 28:18-20; అపొస్తలుల కార్యాలు 10:42.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవునికి లోబడడాన్ని అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించారు, అయితే తాము ప్రభుత్వ అధికారుల్ని గౌరవించాలని కూడా వాళ్లకు తెలుసు. (అపొస్తలుల కార్యాలు 5:29; 1 పేతురు 2:13, 17) వాళ్లు చట్టాలకు లోబడ్డారు, పన్నులు కట్టారు. (రోమీయులు 13:1, 7) వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా సరే, ప్రభుత్వాలు కల్పించే చట్టపరమైన రక్షణ, సేవల నుండి ప్రయోజనం పొందారు.—అపొస్తలుల కార్యాలు 25:10, 11; ఫిలిప్పీయులు 1:7.

తొలి క్రైస్తవులు, రాజకీయాలు—చరిత్ర ఏం చెప్తుంది?

  • “రోమా పౌరులు చేసిన కొన్ని పనులు చేయడానికి క్రైస్తవులు నిరాకరించారు. ... వాళ్లు రాజకీయ పదవులు చేపట్టలేదు.”—ఆన్‌ ద రోడ్‌ టు సివిలైజేషన్‌—ఎ వరల్డ్‌ హిస్టరీ, 238వ పేజీ.

  • “యేసు రాజకీయాల్లో గానీ సైన్యంలో గానీ జోక్యం చేసుకోవాలని అనుకున్నట్టు చూపించే ఎలాంటి రుజువూ లేదు, ... ఆయన శిష్యుల విషయంలో కూడా అదే నిజం.”—జీసస్‌ అండ్‌ జుడాయిజమ్‌, 231వ పేజీ.

  • “ఒక క్రైస్తవుడి విషయానికొస్తే, అతని మతం రాజకీయాలతో సంబంధం లేనిది, మరెంతో ఉన్నతమైనది; అతను అందరికన్నా విశ్వసనీయంగా ఉండేది క్రీస్తుకే తప్ప కైసరుకు కాదు.”—సీజర్‌ అండ్‌ క్రైస్ట్‌, 647వ పేజీ.

  • “రోమా పౌరులకు కోర్టులు కల్పించే చట్టబద్ధమైన రక్షణ నుండి ప్రయోజనం పొందడానికి [అపొస్తలుడైన] పౌలు తన రోమా పౌరసత్వాన్ని ఉపయోగించడానికి ఇష్టపడ్డాడు. కానీ తన కాలంలోని రాజకీయ వివాదాల్లో జోక్యం చేసుకోలేదు, అలా చేయమని ఇతరుల్ని పురికొల్పడానికి కూడా ప్రయత్నించలేదు. ... ప్రభుత్వ అధికారాలకు లోబడాల్సిన బాధ్యత తమకు ఉందని తొలి క్రైస్తవులు నమ్మారు, అయినాసరే తాము రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కూడా వాళ్లు నమ్మారు.”—బియాండ్‌ గుడ్‌ ఇంటెన్షన్స్‌—ఎ బిబ్లికల్‌ వ్యూ ఆఫ్‌ పాలిటిక్స్‌, 122-123 పేజీలు.

  • “తమలో ఎవరూ ప్రభుత్వ పదవి చేపట్టరాదనే నిశ్చిత భావం క్రైస్తవులందరిలో బలంగా నెలకొంది … ఒక పౌర న్యాయాధిపతి తను చర్చిలో చేరాలంటే తన రాజకీయ పదవికి రాజీనామా చేయాలనే షరతు చారిత్రక క్రైస్తవ వాడుకగా ఉండేదని దాదాపు మూడవ శతాబ్ద ఆరంభంలో హిప్పోలిటస్‌ చెప్పాడు.”—ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటీ, 1వ సంపుటి, 253వ పేజీ.

ఈ రోజుల్లో క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు

యేసు గానీ ఆయన తొలి అనుచరులు గానీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు క్రైస్తవులు కాబట్టి లోక రాజకీయాలకు దూరంగా ఉంటారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే వాళ్లు యేసు ఆజ్ఞాపించిన పని చేస్తారు, అంటే “రాజ్య సువార్త” ప్రకటిస్తారు.—మత్తయి 24:14.

a అలా నిరాకరించినప్పుడు యేసు లోక రాజ్యాలన్నిటినీ ఇచ్చే అధికారం సాతానుకు లేదని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత ఒకసారి యేసు అతన్ని “ఈ లోక పరిపాలకుడు” అని పిలిచాడు.—యోహాను 14:30

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి