కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 106
  • నేను టీచర్‌కు నచ్చాలంటే . . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను టీచర్‌కు నచ్చాలంటే . . .
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమ్మో . . . ఆ టీచరా!
  • ఏం చేయవచ్చు అంటే . . .
  • మీ టీచర్‌తో మాట్లాడండి
  • ఉపాధ్యాయులు వాళ్ళు మనకెందుకు అవసరం?
    తేజరిల్లు!—2002
  • ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు చేపట్టాలి?
    తేజరిల్లు!—2002
  • ఉపాధ్యాయ వృత్తి దాని సవాళ్ళు, ప్రమాదాలు
    తేజరిల్లు!—2002
  • గొప్ప బోధకుడు ఇతరులకు సేవ చేశాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 106
ఒక టీనేజీ అమ్మాయిని క్లాస్‌ అందరి ముందు సరి చేస్తున్నటీచర్‌.

యువత అడిగే ప్రశ్నలు

నేను టీచర్‌కు నచ్చాలంటే . . .

  • అమ్మో ... ఆ టీచరా!

  • ఏం చేయవచ్చు అంటే . . .

  • మీ టీచర్‌తో మాట్లాడండి

  • మీ తోటివాళ్లు ఏం అంటున్నారు

అమ్మో . . . ఆ టీచరా!

స్కూల్లో ఒక టీచర్‌ బాగా కోప్పడుతుందని, అనవసరంగా తిడుతుందని దాదాపు ప్రతీ విద్యార్థికి ఎప్పుడోకప్పుడు అనిపిస్తుంది.

  • 21 ఏళ్ల లూయిస్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “మా స్కూల్లో ఘోరంగా తిడుతూ, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే టీచర్‌ ఉండేది. త్వరలోనే ఆమె రిటైర్‌ అవుతుంది కాబట్టి, తనను తీసేస్తారు అనే భయం కూడా ఆమెలో ఉండేది కాదు.”

  • ఒక టీచర్‌ క్లాస్‌లో తనతో మాత్రమే సరిగా ప్రవర్తించేది కాదని 25 ఏళ్ల మెలనీ గుర్తుచేసుకుంటుంది. “ఆమె నాతో అలా ఉండడానికి కారణం నా మతమే. పెద్దయ్యాక నీకు ఇది ఎలాగో తప్పదు కాబట్టి, ఇప్పటి నుండే అలవాటు చేసుకో అని ఆమె నాతో అనేది.”

మీకు కూడా అలాంటి టీచర్‌ ఉంటే, బాధపడుతూ కూర్చోకుండా ఈ కింది టిప్స్‌ పాటించండి.

ఏం చేయవచ్చు అంటే . . .

  • నచ్చేలా ఉండండి. టీచర్లు అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి వాళ్లు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని, వాళ్లకు నచ్చేలా ఉండడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.

    బైబిలు ఏం చెప్తుందంటే: “తెలివిగలవాళ్లు విని, మరింత ఉపదేశం పొందుతారు.”—సామెతలు 1:5.

    “నేను మా టీచర్‌కు నచ్చినట్టు ఉండాలని నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆమెకు నచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నించాను. ఆమె నాతో మంచిగా ఉండడానికి అది హెల్ప్‌ చేసింది.”—క్రిస్టఫర్‌.

  • మర్యాద ఇవ్వండి. మీ టీచర్‌తో మర్యాదగా మాట్లాడండి. వాళ్లు మీతో ఎలా మాట్లాడినా సరే, ఎదురు సమాధానం చెప్పకండి. వాళ్లు మిమ్మల్ని స్టూడెంట్‌లా చూస్తారు తప్ప ఫ్రెండ్‌లా చూడరని గుర్తుంచుకోండి.

    బైబిలు ఏం చెప్తుందంటే: “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.”—కొలొస్సయులు 4:6.

    “చాలామంది పిల్లలు టీచర్స్‌కి గౌరవం ఇవ్వరు. కాబట్టి మీరు గౌరవం ఇస్తూ, మర్యాదగా మాట్లాడినప్పుడు వాళ్లకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.”—సియారా.

  • అర్థంచేసుకోండి. మీ టీచర్స్‌ కూడా అందరిలాంటి వాళ్లే. వాళ్లకు కూడా ఎన్నో బాధలు, టెన్షన్‌లు ఉంటాయి. కాబట్టి వాళ్లు మిమ్మల్ని కావాలనే తిడుతున్నారని, చిరాకు పడుతున్నారని అనుకోకండి.

    బైబిలు ఏం చెప్తుందంటే: “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.”—యాకోబు 3:2.

    “టీచర్స్‌గా ఉండడం అంత ఈజీ ఏం కాదు. అంతమంది పిల్లల్ని కంట్రోల్‌ చేస్తూ, వాళ్లకు చదువు చెప్పడం మామూలు విషయం కాదు. కాబట్టి కనీసం నేనైనా అల్లరి చేయకూడదని, టీచర్‌ని ఇబ్బంది పెట్టకూడదని అనిపించేది.”—అలెక్సిస్‌.

  • మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. మీరు చక్కగా స్కూల్‌కి వెళ్తూ, బాగా చదువుకోవాలని అమ్మానాన్నలు కోరుకుంటారు. కాబట్టి కఠినంగా ఉండే టీచర్స్‌తో ఎలా ఉండాలో కూడా చెప్తారు.

    బైబిలు ఏం చెప్తుందంటే: “ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి.”—సామెతలు 15:22.

    “మీ అమ్మానాన్నలకు చాలా అనుభవం ఉంటుంది. వాళ్లు ఇంతకన్నా పెద్దపెద్ద సమస్యల్నే దాటి ఉంటారు. కాబట్టి వాళ్ల సలహాలు అడిగి తీసుకోండి. అది మీకే మంచిది.”—ఒలీవియా.

మీ టీచర్‌తో మాట్లాడండి

మీ టీచర్‌ వల్ల మీకు ఏం ఇబ్బంది ఉందో కొన్నిసార్లు నేరుగా చెప్పాల్సి రావచ్చు. వాదన పెట్టుకున్నట్లు అవుతుందేమో అని భయపడవద్దు. మీరు వాదన పెట్టుకోవడం లేదు, మీ బాధ చెప్పుకుంటున్నారంతే! అలా చెప్పాక టీచర్‌తో మాట్లాడడం అంత కష్టమేమీ కాదని పైగా, అలా చేయడం వల్ల మీకు మంచే జరుగుతుందని అర్థమౌతుంది.

బైబిలు ఏం చెప్తుందంటే: ‘శాంతిగా ఉండడానికి చేయగలిగినదంతా చేద్దాం.’— రోమీయులు 14:19.

“ఒకవేళ మీ టీచర్‌ మీ మీద చిరాకు, కోపం చూపిస్తుంటే మీరు ఏం తప్పు చేశారో తననే అడిగి తెలుసుకోండి. మీ టీచర్‌ ఇచ్చే జవాబు వల్ల ఎక్కడ సరిచేసుకోవాలో మీకు అర్థమౌతుంది.”—జూలియానా.

“మిమ్మల్ని బాధపెట్టిన విషయం గురించి అందరి ముందు కాకుండా మీ టీచర్‌ ప్రశాంతంగా ఒక్కరే ఉన్నప్పుడు, వెళ్లి చెప్పడం మంచిది. అలా చేయడం వల్ల మీ టీచర్‌కి మీ మీద మంచి అభిప్రాయం రావచ్చు, అలాగే మిమ్మల్ని అర్థంచేసుకోవచ్చు.”—బెంజమిన్‌.

నిజంగా జరిగిన ఒక కథ

“నాకు స్కూల్లో బాగా తక్కువ మార్కులు వచ్చేవి, పైగా మా టీచర్‌ కూడా ఏం పట్టించుకునేది కాదు. ఆమె వల్ల నాకు చాలా కష్టంగా అనిపించి, చివరికి స్కూల్‌ మానేయాలని అనుకున్నాను.

“సలహా కోసం ఒక సార్‌ దగ్గరికి వెళ్లాను. ఆ సార్‌ నాకు ఇలా చెప్పాడు: ‘నీ గురించి మీ టీచర్‌కు గానీ, మీ టీచర్‌ గురించి నీకు గానీ ఏమీ తెలీదు. అసలు నీ సమస్య ఏంటో మీ టీచర్‌కు చెప్పు. దానివల్ల నీలాగే ఆమెతో మాట్లాడడానికి భయపడుతున్న మిగతావాళ్లకు నువ్వు హెల్ప్‌ చేసినట్టు అవుతుంది.’

“నిజం చెప్పాలంటే నాకు ఆమెతో మాట్లాడాలని అస్సలు అనిపించలేదు. కానీ సార్‌ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తే ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది. నా పరిస్థితి మారాలంటే నేనే ఒక అడుగు ముందుకు వేయాలి.

“కాబట్టి ఆ తర్వాతి రోజు నేనే మా టీచర్‌ దగ్గరికి వెళ్లి ఆమె చెప్పే క్లాసులు అంటే నాకు చాలా ఇష్టమని, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటున్నానని మర్యాదగా చెప్పాను. అయితే నాకు అర్థం కావడం లేదని, ఏం చేయాలో తెలియడం లేదని కూడా చెప్పాను. దాంతో ఆమె నాకు కొన్ని సలహాలు ఇచ్చింది. అంతేకాదు క్లాస్‌ తర్వాత కూడా హెల్ప్‌ చేస్తానని చెప్పింది.

“అది విని నేను షాక్‌ అయిపోయాను. అలా మాట్లాడిన తర్వాత, ఇప్పటివరకు మా మధ్య ఉన్న అడ్డుగోడను నేను కూల్చేశాను. దాంతో నా స్కూల్‌ లైఫ్‌ సాఫీగా సాగింది.”—మరియా.

క్లాస్‌ అయిపోయిన తర్వాత టీచర్‌తో మాట్లాడుతున్న మరియా

టిప్‌: ఒకవేళ మీ టీచర్‌తో మీకు ఇబ్బంది ఉంటే రానున్న రోజులకు అది ఒక ట్రైనింగ్‌ అనుకోండి. 22 ఏళ్ల కేటి ఇలా చెప్తుంది: “మీ స్కూల్‌ చదువు అయిపోయాక, ఇంకా కఠినంగా ఉండే పెద్దపెద్ద అధికారులతో పని చేయాల్సి రావచ్చు. ఇప్పుడు స్కూల్లో మీ టీచర్‌ని ఎదుర్కొంటే ముందుముందు మీకే ఈజీ అవుతుంది.”

మీ తోటివాళ్లు ఏం అంటున్నారు

జేజా.

“కొన్నిసార్లు మా టీచర్‌ వల్ల నేను ఇబ్బంది పడ్డాను. అప్పుడు నేను ఆ టీచర్‌ వైపు నుండి ఆలోచించేలా మా అమ్మ నాకు సహాయం చేసింది. దానివల్ల నేను టీచర్స్‌తో చక్కగా ఉండగలిగాను.”—జేజా.

విక్టర్‌.

“ఒక వ్యక్తి నచ్చకపోయినా, ఆ వ్యక్తి స్థానాన్ని గౌరవించాలి. టీచర్లు గౌరవానికి అర్హులు. కాబట్టి టీచర్‌ కఠినంగా ఉన్నా, గౌరవం చూపించడం మనకే మంచిది. అలా చేస్తే ఆ టీచర్‌ కూడా మీతో మంచిగా ఉండవచ్చు.”—విక్టర్‌.

జూలియా.

“మీ టీచర్‌ మీతో దయగా, మర్యాదగా ప్రవర్తించకపోయినా మీరు మాత్రం దయగా, మర్యాదగా ఉండండి. అప్పుడు మీకు వినయం, గౌరవం ఉన్నాయని చూపిస్తారు. అప్పుడు మీ టీచర్‌ మనసు కరిగి మీతో చక్కగా ఉండొచ్చు.”—జూలియా.

వీటిని గుర్తుచేసుకుందాం: నేను టీచర్‌కు నచ్చాలంటే . . .

  • నచ్చేలా ఉండండి. మీ టీచర్‌ ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని వాళ్లకు నచ్చేలా ఉండడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.

  • మర్యాద ఇవ్వండి. మీరు ఒక స్టూడెంట్‌ అని గుర్తుంచుకోండి, కాబట్టి ఎప్పుడూ మర్యాదగా మాట్లాడండి, ఎదురు సమాధానం చెప్పకండి.

  • అర్థంచేసుకోండి. టీచర్లుగా పని చేయడం అంత ఈజీ ఏం కాదు. మీరు చక్కగా ఉంటూ వాళ్లకు మీ వంతు సహాయం చేయండి.

  • మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. వాళ్లు ఎన్నో దాటి వచ్చారు కాబట్టి ఇతరులతో ఎలా ఉండాలో వాళ్లకు బాగా తెలుసు.

  • మీ టీచర్‌తో మాట్లాడండి. వాదన పెట్టుకోకుండా మీ టీచర్‌తో ప్రశాంతంగా మాట్లాడండి, హెల్ప్‌ తీసుకోండి. మీ టీచర్‌ చెప్పింది చేస్తాను అని చెప్పండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి