కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 నవంబరు పేజీ 32
  • ‘దేవునికి సంబంధించిన వరం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దేవునికి సంబంధించిన వరం’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • బెస్ట్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఎందుకు అంత అమూల్యమైంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఛరిష్మా—మానవునికి స్తుతి లేక దేవునికి మహిమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 నవంబరు పేజీ 32

బైబిల్లోని మాట

‘దేవునికి సంబంధించిన వరం’

మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో సమయం గడపడమంటే మనందరికి చాలా ఇష్టం. అయితే, మనం ప్రోత్సాహం పొందాలంటే ఊరికే అలా సమయం గడిపితే సరిపోదు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు పెంచే ఈ సామర్థ్యాన్నే, ‘దేవునికి సంబంధించిన వరం’ అని బైబిలు పిలుస్తుంది. (రోమా. 1:11, 12) మరి, మనం ఈ వరాన్ని ఎలా చక్కగా వాడొచ్చు?

మంచి మాటలతో ప్రోత్సహించండి. ఉదాహరణకు, మనం కామెంట్స్‌ చెప్తూ ప్రోత్సహించవచ్చు. ఎలాగంటే, మనం చెప్పే కామెంట్స్‌ వల్ల అందరి దృష్టి యెహోవా మీద, బైబిలు మీద, ఆయన నమ్మకమైన సేవకుల మీద ఉండాలే గానీ మన మీద కాదు. అంతేకాదు, మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రోత్సహించవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం వాళ్ల విశ్వాసాన్ని పెంచే విషయాల గురించే మాట్లాడాలి.

మీ నిర్ణయాల ద్వారా, పనుల ద్వారా వేరేవాళ్లను ప్రోత్సహించండి. ఉదాహరణకు, మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, పూర్తికాల సేవలోనే ఉండాలనే మీ నిర్ణయాన్ని ఇతరులు గమనిస్తారు. లేదా, మీరు ఉద్యోగంలో ఎంత అలసిపోయినా, చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నా వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌కి వచ్చినప్పుడు అది ఇతరులు చూస్తారు. ఇవన్నీ వాళ్లను ఎంతో ప్రోత్సహిస్తాయి.

మీ మాటలు, పనులు మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ని ప్రోత్సహిస్తున్నాయా? మిమ్మల్ని ప్రోత్సహించడానికి వేరేవాళ్లు చెప్పేవి, చేసేవి మీరు గమనిస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి