అధ్యయనం కోసం చిట్కా
నేర్చుకోండి, చెప్పండి
అధ్యయనం, మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది, సేదదీర్పునిస్తుంది. అయితే, మనం నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్పి, ప్రోత్సహిస్తే ఇంకా ఉత్తేజంగా, సేదదీర్పుగా అనిపిస్తుంది. సామెతలు 11:25 ఇలా చెప్తుంది: “ఇతరుల్ని సేదదీర్చే వాళ్లు తాము కూడా సేదదీర్పు పొందుతారు.”
మనం నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్తే, గుర్తుపెట్టుకోవడం తేలికౌతుంది, విషయాల్ని ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతాం. అలాంటి రత్నాలు వేరేవాళ్లకు కూడా చాలా పనికొస్తాయి కాబట్టి వాటిని చెప్తే మనకు సంతోషంగా ఉంటుంది.—అపొ. 20:35.
ఇలా చేసి చూడండి: రాబోయే వారంలో, మీరు నేర్చుకున్న ఏదైనా విషయం వేరేవాళ్లకు చెప్పండి. ఇంట్లోవాళ్లకో, సంఘంలోవాళ్లకో, మీతో కలిసి పనిచేసేవాళ్లకో లేదా చదువుకునేవాళ్లకో, పక్కింటివాళ్లకో లేదా ప్రీచింగ్‌లో కలిసేవాళ్లకో చెప్పి చూడండి. విషయాన్ని మీ సొంత మాటల్లో, అర్థమయ్యేలా చెప్పండి.
గుర్తుంచుకోండి: వేరేవాళ్లను ప్రోత్సహించడానికి చెప్పండి గానీ వాళ్లను బుట్టలో వేసుకోవడానికి చెప్పకండి.—1 కొరిం. 8:1.