అధ్యయనం కోసం చిట్కా
యెహోవాకున్న రత్నాల్లాంటి లక్షణాలు తెలుసుకోండి
మనం బైబిలు చదువుతున్నప్పుడు, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి రకరకాల అధ్యయన పనిముట్లను ఉపయోగించవచ్చు. అయితే, మనం కేవలం బైబిలు జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే కాదు గానీ, యెహోవాకున్న రత్నాల్లాంటి లక్షణాల్ని తవ్వి తీసి, ఆయన మీద ప్రేమను పెంచుకోవడానికి అలా చేస్తాం. దానికోసం, మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను చదివిన ఈ భాగం యెహోవా గురించి ఏం నేర్పిస్తుంది?’
మనం యెహోవాకున్న ప్రేమ, జ్ఞానం, న్యాయం, శక్తి గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. అయితే, యెహోవాకు కేవలం ఈ నాలుగే కాదు ఇంకా ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. మరి, ఈ లక్షణాల గురించి మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు?
వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో “జెహోవా” అనే శీర్షిక కింద ఉన్న “క్వాలిటీస్ బై నేమ్” అనే ఉపశీర్షికలో ఇచ్చిన 50 కన్నా ఎక్కువ లక్షణాల్ని పరిశీలించండి. మీరు చదువుతున్న బైబిలు భాగానికి సరిగ్గా సరిపోయే లక్షణాన్ని అందులో పరిశోధన చేయవచ్చు. (ఒకవేళ యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం మాత్రమే మీకు అందుబాటులో ఉంటే, దాంట్లో “యెహోవా దేవుడు” అనే శీర్షిక కింద ఉన్న “యెహోవా లక్షణాలు” అనే ఉపశీర్షిక చూడండి.)