పరిశోధన చేయడానికి చిట్కా
కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో ఉన్న రెఫరెన్సులు
మన రెఫరెన్సులు చాలా విషయాల గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ రెఫరెన్సుల్లో, తెలుగులో ఉన్న యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, అలాగే ఎన్నో భాషల్లో ఉన్న పదకోశం, లేఖనాలపై అంతర్దృష్టి, వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ఉన్నాయి.
రెఫరెన్సులను చూడ్డానికి కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో ఉన్న “వెతుకు” అనే ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. మీరు “వెతుకు” అనే బాక్సులో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు, దానికి సంబంధించిన పదాలు కూడా కనిపిస్తాయి. మీకు కనిపించే ఏ పదాల పక్కనైనా “అంశం” అని కూడా కనిపిస్తుంది.
ఇలా చేయండి: “వెతుకు” అనే బాక్సులో (ఎ) “యెహోవా దేవుడు” అని టైప్ చేయండి. “యెహోవా దేవుడు” అనే పదం పక్కన “అంశం” (బి) అని వచ్చిన దాన్ని ఎంచుకోండి. అప్పుడు ఆ పదం ఏయే రెఫరెన్సుల్లో ఉందో తెలిపేవన్నీ మీకు కనిపిస్తాయి.