కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp22 No. 1 పేజీలు 6-7
  • 1 | పక్షపాతం చూపించకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1 | పక్షపాతం చూపించకండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సలహా:
  • దానర్థం:
  • మనం ఏం చేయవచ్చు?
  • తీతు—‘మీ విషయంలో జతపనివాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • 3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • యెహోవా “పక్షపాతి కాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
wp22 No. 1 పేజీలు 6-7
ఒక నల్లజాతి వ్యక్తి నవ్వుతూ కనిపిస్తున్న ఒక తెల్లజాతి వ్యక్తి ఫోటోను పట్టుకున్నాడు. ఒక తెల్లజాతి వ్యక్తి నవ్వుతూ కనిపిస్తున్న ఒక నల్లజాతి వ్యక్తి ఫోటో పట్టుకున్నాడు. కోపంతో ఉన్న రకారకాల ప్రజల ఫోటోలు వెనక కనిపిస్తున్నాయి.

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

1 | పక్షపాతం చూపించకండి

బైబిలు సలహా:

‘దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను [చేసేవాళ్లందర్నీ] ఆయన అంగీకరిస్తాడు.’—అపొస్తలుల కార్యాలు 10:34, 35.

దానర్థం:

యెహోవాa దేవుడు మనది ఏ దేశం, ఏ జాతి, ఏ రంగు, ఏ సంస్కృతి అనేది చూడడు. ఆయన మన మనసును చూస్తాడు. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం నిజంగా ఎలాంటివాళ్లం అనేదే చూస్తాడు. మనుషులు మాత్రమే ‘కంటికి కనిపించేదాన్ని చూస్తారు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు’ అని బైబిలు చెప్తుంది.—1 సమూయేలు 16:7.

మనం ఏం చేయవచ్చు?

మనమైతే హృదయాల్ని చదవలేం; కానీ దేవునిలాగే మనం కూడా పక్షపాతం లేకుండా అందర్నీ సమానంగా చూడొచ్చు. ఒక వ్యక్తి ఎలాంటివాడు అనేది అతని దేశం, జాతిని బట్టి అంచనా వేయకూడదు. ఒకవేళ ఏదైనా దేశం వాళ్లమీద గానీ, జాతి వాళ్లమీద గానీ మీకు మంచి అభిప్రాయం లేకపోతే ఆ అయిష్టాన్ని పూర్తిగా తీసేసుకోవడానికి సహాయం చేయమని దేవున్ని అడగాలి. (కీర్తన 139:23, 24) పక్షపాతం చూపించకుండా ఉండడానికి సహాయం చేయమని మనస్ఫూర్తిగా అడిగితే, యెహోవా మీ విన్నపాన్ని విని ఖచ్చితంగా సహాయం చేస్తాడు.—1 పేతురు 3:12.

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.

“నాకు మొదట్లో అసలు తెల్లజాతి వాళ్లంటేనే పడేది కాదు . . . తోబుట్టువుల్లా కలిసివుండే యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లలో నేనూ ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.”—టైటస్‌

నిజ జీవిత అనుభవం—టైటస్‌

ద్వేషాన్ని తీసేసుకున్నాడు

టైటస్‌.

చట్టాల పేరుతో తన జాతి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని చూసీచూసీ టైటస్‌ విసిగిపోయాడు. అందుకే తనలాంటి అభిప్రాయాలున్న ఒక రౌడీ గ్యాంగ్‌తో చేతులు కలిపాడు. టైటస్‌ ఇలా చెప్పాడు: “మా ప్రాంతంలో ఉన్న కొన్ని హోటళ్లలో, బార్‌లలో నల్లజాతి వాళ్లతో సరిగ్గా ప్రవర్తించేవాళ్లు కాదు. ఎలాగైనా గొడవ సృష్టించాలనే ఉద్దేశంతో మేము అక్కడికే వెళ్లేవాళ్లం. ఎవరితోనైనా మాటామాటా పెరిగితే వాళ్లు మగవాళ్లా-ఆడవాళ్లా అని చూడకుండా ముందు కొట్టేసేవాడిని.” మనసు నిండా ఉన్న ద్వేషమే తన కోపానికి కారణమని టైటస్‌ తర్వాత గ్రహించాడు.

యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక అతనిలో మెల్లమెల్లగా మార్పు వచ్చింది. దానికి కారణం బైబిలు. ముఖ్యంగా, “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు” అని భవిష్యత్తు గురించి దేవుడు ఇచ్చిన మాట అతని మనసును హత్తుకుంది.—ప్రకటన 21:3, 4.

ద్వేషాన్ని తీసేసుకోవడానికి మొదట్లో టైటస్‌ చాలా కష్టపడ్డాడు. “ఒకప్పటిలా ఆలోచించకుండా, ప్రవర్తించకుండా ఉండడం ఈజీగా అనిపించలేదు” అని అతను చెప్పాడు. కష్టమైనా మారడానికి అతనికి ఏం సహాయం చేశాయి? దేవుడు పక్షపాతి కాడని అపొస్తలుల కార్యాలు 10:34, 35⁠లోని మాటలు అతనికి సహాయం చేశాయి.

తర్వాత ఏం జరిగింది? టైటస్‌ ఇలా చెప్పాడు: “యెహోవాసాక్షులు జాతిని, రంగును పట్టించుకోకుండా ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను చూశాక వాళ్లదే నిజమైన మతమని అర్థమైంది. నేనింకా బాప్తిస్మం కూడా తీసుకోకముందే, నేను వెళ్తున్న సంఘంలో ఒక తెల్లజాతి వ్యక్తి నన్ను వాళ్ల ఇంటికి భోజనానికి పిలిచాడు. అది కలో నిజమో అర్థంకాలేదు! ఎందుకంటే, నాకు మొదట్లో అసలు తెల్లజాతి వాళ్లంటేనే పడేది కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్లింటికి వెళ్లి వాళ్లతో కలిసి భోంచేస్తున్నాను. తోబుట్టువుల్లా కలిసివుండే యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లలో నేనూ ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.”

టైటస్‌ జీవితం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, 2009 ఆగస్టు 1, కావలికోట పత్రికలోని 28-29 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి