కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 2 పేజీలు 10-12
  • కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయవచ్చు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవున్ని తెలుసుకోవడం” వల్ల లోకాంతం నుండి తప్పించుకుంటాం
  • దేవుని వాక్యమైన బైబిల్ని ప్రతిరోజూ చదవండి
  • సహాయం కోసం దేవునికి ప్రార్థించండి
  • దేవుడు ఏమి చేశాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • శాశ్వతకాలం జీవించాలంటే ఏమి చేయాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుని శాంతియుతమైన క్రొత్త లోకం —అందులో జీవించాలంటే మీరు ఏంచేయాలి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 2 పేజీలు 10-12

కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయవచ్చు?

ఈ లోకంలో ఉన్న చెడ్డ ప్రజల్ని, వాళ్ల వల్ల కలిగిన సమస్యలన్నిటినీ దేవుడు త్వరలోనే తీసేస్తాడని మనం ముందటి ఆర్టికల్స్‌లో చూశాం. అలా జరుగుతుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యమైన బైబిలు ఇలా మాటిస్తుంది:

“లోకం, దాని ఆశ నాశనం కాబోతున్నాయి.”—1 యోహాను 2:17.

అందరు నాశనం కారు కానీ, కొంతమంది జీవిస్తారని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే పైన ప్రస్తావించిన బైబిలు వచనం ఇంకా ఇలా మాటిస్తుంది:

“అయితే దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.”

కాబట్టి మనం కాపాడబడాలి అంటే దేవుని ఇష్టాన్ని చేయాలి. అయితే మనం దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి మొదట ఆయన గురించి నేర్చుకోవాలి.

“దేవున్ని తెలుసుకోవడం” వల్ల లోకాంతం నుండి తప్పించుకుంటాం

చిత్రాలు: 1. హాస్పిటల్‌ ఒక నర్సు నేలమీద కూర్చుంది. ఆమె విసికిపోయి, బాధలో మునిగిపోయింది. 2. ఆమె విరామ సమయంలో ఒక కాఫీ షాపులో కూర్చుని, తోటి ఉద్యోగి సంతోషంగా పత్రిక చదవుతూ ఉండడం గమనించింది. 3. తోటి ఉద్యోగికి ఒక బైబిలు వచనం చదివి, ఆమెకు jw.org కాంటాక్టు కార్డు ఇచ్చింది.

“ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం” అని యేసు చెప్పాడు. (యోహాను 17:3) లోకాంతం నుండి తప్పించుకుని శాశ్వతకాలం జీవించాలంటే, మనం ‘దేవుని గురించి తెలుసుకోవాలి.’ అంటే దేవుడున్నాడని నమ్మడం లేదా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు. మనం దేవునికి స్నేహితులు అవ్వాలి. ఎవరితోనైన మన స్నేహం బలపడాలంటే, ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలి. దేవునితో చేసే స్నేహం కూడా అంతే. దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి బైబిల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సత్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బైబిలు నుండి మనం తెలుసుకునే సత్యాలు

ఆ నర్సు తన ఇంట్లో jw.org వెబ్‌సైట్‌ చూస్తుంది.

మనం పరదైసులో జీవించాలి అనేది దేవుని కోరిక అని తెలుసుకుంటాం.

దేవుడు మొదటి మనుషులైన ఆదాముహవ్వలను సృష్టించి అందమైన ప్రదేశంలో పెట్టాడు. దాన్ని ఏదెను తోట అని పిలిచేవాళ్లు. అయితే ఆదాముహవ్వలు పరిపూర్ణులు, అంటే వాళ్లలో ఎలాంటి లోపం లేదు. అంతేకాదు వాళ్లు సంతోషంగా జీవించడానికి కావాల్సిన ప్రతీదాన్ని దేవుడు వాళ్లకు ఇచ్చాడు. అలాగే వాళ్లు శాశ్వత కాలం జీవించే అవకాశం కూడా ఉంది. దేవునితో ఉన్న తమ స్నేహాన్ని కాపాడుకుని ఉంటే, వాళ్లు ఎప్పటికీ చనిపోయేవాళ్లు కాదు. కానీ దేవుడు వాళ్లకిచ్చిన తేలికైన ఆజ్ఞను పాటించే విషయంలో ఆయన మాట వినలేదు.

మనం ఇప్పుడు ఎందుకు బాధలుపడుతున్నామో తెలుసుకుంటాం.

మొదటి మానవుడైన ఆదాము అవిధేయత చూపించడం వల్ల తాను, మిగతా మనుషులందరూ శాశ్వతంగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దాని గురించి బైబిలు ఇలా వివరిస్తుంది: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్లో ఉన్న లోపాన్ని ఎలా వారసత్వంగా పొందుతాడో, అలాగే ఆదాము పిల్లలు కూడా అపరిపూర్ణతను వారసత్వంగా పొందారు. దానివల్ల అందరూ వృద్ధులై చనిపోతున్నారు.

మనకు సహాయం చేయడానికి దేవుడు ఇప్పటికే ఏం చేశాడో తెలుసుకుంటాం.

బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన​మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహాను 3:16) దేవుడు ఈ భూమ్మీదకు యేసును పంపించాడు, ఆయన మనందరి కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రేమ గురించి భారతదేశంలో ఉంటున్న 86 ఏళ్ల ప్రభాకర్‌ అనే ఒకతను ఇలా చెప్తున్నాడు: “నా మీద యెహోవాకుa చాలా ప్రేమ ఉందని ఇది చూపిస్తుంది. ఆయన ప్రేమ శాశ్వత కాలం జీవించే ఆశను నాలో నింపింది.”

దేవుడు మన కోసం చేసినవాటికి ఎలా కృతజ్ఞత చూపించవచ్చో మనం తెలుసుకుంటాం.

‘ఆయన ఆజ్ఞల్ని పాటించడం’ ద్వారా దేవుడు మన కోసం చేసినవాటికి మనం కృతజ్ఞత చూపించవచ్చు అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:3) ఇప్పుడు సంతోషంగా జీవించడానికి మనం ఏం చేయాలో దేవుడు ప్రేమతో చెప్తున్నాడు. (యెషయా 48:17, 18) మనం బాధలుపడడం దేవునికి ఇష్టంలేదు. ఆయన మాట వింటే, మనం ఇప్పుడు సంతోషంగా జీవిస్తాం, శాశ్వత జీవితాన్ని కూడా సొంతం చేసుకుంటాం అని దేవుడు మాటిస్తున్నాడు.

దేవుని వాక్యమైన బైబిల్ని ప్రతిరోజూ చదవండి

ఆ నర్సు విరామ సమయంలో బయట కూర్చుని, బైబిలు చదివాక ఆకాశం వైపు చూస్తుంది.

మీరు దేవుని సహాయం కోసం ప్రార్థిస్తూ, ఆయన ఇష్టాన్ని చేస్తూ ఉండడం వల్ల ఈ లోకాంతాన్ని తప్పించుకోవచ్చు

జీవించడానికి మనం ప్రతిరోజూ ఆహారం తీసుకుంటాం. కానీ యేసు ఇలా అన్నాడు: “మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి.”—మత్తయి 4:4.

యెహోవా మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. మీరు ఆ పవిత్ర పుస్తకాన్ని చదువుతున్నకొద్దీ గతంలో దేవుడు ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, త్వరలో ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటారు.

సహాయం కోసం దేవునికి ప్రార్థించండి

దేవునికి లోబడాలనే కోరిక మీకు ఉన్నా, ఆయన చేయొద్దు అన్న పనులు మానడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు మీరేం చేయొచ్చు? దేవుని గురించి బాగా తెలుసుకున్నప్పుడు మీకు సహాయం దొరుకుతుంది.

అనైతిక జీవితాన్ని గడిపిన సకూర అనే ఒక స్త్రీ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఆమె బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడు, “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి” అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి నేర్చుకుంది. (1 కొరింథీయులు 6:18) బలం కోసం సకూర దేవునికి ప్రార్థించింది. అలా ఆమెకు ఉన్న చెడ్డ అలవాట్లను మానుకోగలిగింది. కానీ, ఇప్పటికీ ఆమె తప్పు చేయాలనే కోరికలతో పోరాడుతుంది. “ఎప్పుడైనా అనైతిక ఆలోచనలు వచ్చినప్పుడు, నేను యెహోవాతో మనసు విప్పి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే దీనితో పోరాడలేనని నాకు తెలుసు. పట్టుదలగా ప్రార్థించడం వల్ల నేను యెహోవాకు చాలా దగ్గరయ్యాను” అని ఆమె చెప్తుంది. సకూరలా నేడు లక్షలమంది దేవుని గురించి తెలుసుకుంటున్నారు. ప్రజలు తమ జీవితంలో మార్పులు చేసుకొని ఆయన్ని సంతోషపెట్టేలా దేవుడు వాళ్లకు సహాయం చేస్తున్నాడు.—ఫిలిప్పీయులు 4:13.

మీరు దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే “దేవుడు మీ గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాడు.” అలా మీరు దేవునితో దగ్గరి సంబంధాన్ని ఆనందిస్తారు. (గలతీయులు 4:9; కీర్తన 25:14) అప్పుడు, మీరు దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలోకి వెళ్లే అర్హతను సంపాదించుకుంటారు. అయితే, కొత్త లోకం ఎలా ఉంటుంది? దాని గురించి తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి