కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 1 పేజీలు 14-15
  • ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన—మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 1 పేజీలు 14-15

ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

పామెలా, తనకు క్యాన్సర్‌ ఉందని తెలిసినప్పుడు చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లింది. అంతేకాదు, తన కష్టమైన పరిస్థితిని సహించడానికి కావాల్సిన బలం కోసం దేవునికి ప్రార్థించింది. మరి ప్రార్థన ఆమెకు సహాయం చేసిందా?

పామెలా ఇలా అంటుంది, “క్యాన్సర్‌కి చికిత్స తీసుకునేటప్పుడు నాకు చాలా భయం వేసేది. కానీ నేను యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు నెమ్మది పొందాను. అలాగే నా భయం తగ్గి, పరిస్థితిని సహించగలిగాను. అనారోగ్యం వల్ల నేను ఇప్పటికీ ఎంతో నొప్పితో బాధపడుతున్నాను. కానీ నిరాశపడకుండా, సానుకూలంగా ఆలోచించేలా ప్రార్థన నాకు సహాయం చేస్తుంది. ఎవరైనా నన్ను ‘ఎలా ఉన్నావు?’ అని అడిగినప్పుడు ‘నాకు ఆరోగ్యం బాలేదు. కానీ సంతోషంగా ఉన్నాను,’ అని అంటాను.”

అలాంటి పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనం వేరే సమయాల్లో కూడా ప్రార్థించవచ్చు. అవును, మనందరికీ సమస్యలు వస్తాయి; అవి చిన్నవైనా, పెద్దవైనా వాటిని ఎదుర్కోవడానికి సహాయం కావాలని అనిపిస్తుంది. మరి ప్రార్థన సహాయం చేయగలదా?

“నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు,” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 55:22) ఆ మాటలు ఎంత ఓదార్పును ఇస్తున్నాయో కదా! కాబట్టి ప్రార్థన మీకెలా సహాయం చేయగలదు? మీరు సరైన విధంగా దేవునికి ప్రార్థించినప్పుడు, మీ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఆయన మీకు కావాల్సిన సహాయాన్ని ఇస్తాడు.—“ప్రార్థన చేయడం వల్ల ఏం పొందుతాం?” అనే బాక్సు చూడండి.

ప్రార్థన చేయడం వల్ల ఏం పొందుతాం?

మనశ్శాంతి

ముందు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు నవ్వుతూ, ధైర్యంగా నడుస్తున్నాడు.

“మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, . . . అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.” (ఫిలిప్పీయులు 4:6, 7) మీరు మీ బాధంతా దేవునికి చెప్పుకున్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతంగా ఉంటూ, తెలివిగా నడుచుకునేలా ఆయన మీకు సహాయం చేస్తాడు.

దేవుని నుండి వచ్చే తెలివి

అంతకుముందు పుస్తకం నుండి ప్రార్థనలు చదివిన ఒకామె, తన ఇంట్లో బైబిలు చదువుతుంది.

“కాబట్టి, మీలో ఎవరికైనా తెలివి తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, అది అతనికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆయన కోప్పడకుండా అందరికీ ఉదారంగా ఇస్తాడు.” (యాకోబు 1:5) మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతీసారి సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కాబట్టి తెలివి కోసం దేవునికి ప్రార్థిస్తే ఆయన తన వాక్యమైన బైబిల్లో రాయించిన ఎన్నో ఉపయోగకరమైన సూత్రాల్ని మీకు గుర్తుచేస్తాడు.

శక్తి, ఓదార్పు

అంతకుముందు హాస్పిటల్‌లో ఉన్న ఒక జంట ఇప్పుడు పార్క్‌లో నడుస్తున్నారు. ఆ భర్త తన భార్యకు చేతికర్ర పట్టుకుని నడిచేలా ప్రేమతో సహాయం చేస్తున్నాడు.

“ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) యెహోవా సర్వశక్తిగల దేవుడు కాబట్టి మీ సమస్యల్ని ఎదుర్కోవడానికి, మీ కష్టాల్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వగలడు. (యెషయా 40:29) బైబిలు యెహోవా దేవున్ని “ఓదార్పును ఇచ్చే దేవుడు” అని కూడా పిలుస్తుంది. ఆయన “మన కష్టాలన్నిట్లో” మనల్ని ఓదార్చగలడు.—2 కొరింథీయులు 1:3, 4.

దేవునికి ప్రార్థించండి!

ప్రార్థన చేయమని యెహోవా ఎప్పుడూ బలవంతపెట్టడు, బదులుగా తనకు ప్రార్థించమని మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాడు. (యిర్మీయా 29:11, 12) గతంలో మీరు చేసిన ప్రార్థనలకు జవాబు దొరకలేదని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అలా అనిపించినా ప్రార్థించడం మాత్రం ఆపకండి! ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగిన విధంగానే, లేదా అడిగిన వెంటనే సహాయం చేయకపోవచ్చు. బహుశా పిల్లలు ఊహించినదానికంటే మరింత మెరుగ్గా తల్లిదండ్రులు సహాయం చేయగలరు. ఏదేమైనా ఒకటి మాత్రం ఖచ్చితం, ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా సహాయం చేస్తారు.

మానవ తండ్రులందరికంటే, ఎంతో ప్రేమగల తండ్రైన యెహోవా దేవుడు కూడా, మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఇప్పటివరకు చూసిన సలహాల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి, వాటిని పాటించడానికి కృషి చేస్తే, దేవుడు మీ ప్రార్థనలకు ఖచ్చితంగా సరైన జవాబు ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు!—కీర్తన 34:15; మత్తయి 7:7-11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి