మార్చి 23-29
యెషయా 48-49
పాట 89, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యెహోవా చెప్పేది వినండి, పాటించండి
(10 నిమి.)
యెహోవా తన సేవకులకు బోధిస్తాడు (యెష 48:17; lff పాఠం 35 పాయింట్ 1)
యెహోవా చెప్పేది ఎప్పుడూ శ్రద్ధగా వినాలి (యెష 48:18ఎ; ijwbq ఆర్టికల్ 44 ¶2-3)
అప్పుడు మన శాంతి “నదిలా,” మన నీతి “సముద్ర తరంగాల్లా” ఉంటాయి (యెష 48:18బి; lv 227 ¶8)
అర్థం: “శాంతి” అని అనువదించిన హీబ్రూ పదానికి మంచి ఆరోగ్యం, భద్రత, బలం, స్నేహం, సంపూర్ణత అనే అర్థాలు కూడా ఉన్నాయి.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
యెష 48:17—మీటింగ్స్‌లో కామెంట్స్ చెప్పడం మనకే ఎందుకు మంచిది? (w19.01 10 ¶7)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) యెష 48:9-20 (th అధ్యాయం 11)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. నిష్క్రియుడైన మీ బంధువుని ప్రత్యేక ప్రసంగానికి, జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (lmd పాఠం 5 పాయింట్ 3)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని అనుకుంటున్న వ్యక్తికి, ఆ ఆచరణలో ఏమేం జరుగుతాయో వివరించండి. (lmd పాఠం 9 పాయింట్ 3)
6. మళ్లీ కలిసినప్పుడు
(5 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ముగిశాక, కొత్తగా వచ్చిన వ్యక్తి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. (lmd పాఠం 8 పాయింట్ 3)
పాట 107
7. సంవత్సరంలోనే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన రోజు నుండి ప్రయోజనం పొందండి
(15 నిమి.) చర్చ.
ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం ద్వారా మనం యేసు ఆజ్ఞకు లోబడతాం, యెహోవా ఇచ్చిన విమోచన క్రయధనం అనే బహుమతి పట్ల కృతజ్ఞత చూపిస్తాం. (లూకా 22:19) అయితే, ఈ సమయంలో యెహోవా, యేసు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో కూడా గుర్తుచేసుకోవాలి. (గల 2:20; 1యో 4:9, 10) యెహోవా చేసిన ఈ ఏర్పాటు నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? ఈ విషయంలో మనం కొత్తవాళ్లకు కూడా ఎలా సహాయం చేయవచ్చు?
జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాల్ని చదివి, ధ్యానించండి
విమోచన క్రయధనం అనే బహుమతి గురించి ధ్యానించండి, దానిమీద కృతజ్ఞత చూపిస్తూ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఆలోచించండి
ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలిసినవాళ్లను, బంధువుల్ని, టెరిటరీలో ఉన్నవాళ్లను ప్రత్యేక ప్రసంగానికి, జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి చేయగలిగినదంతా చేయండి
జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చినవాళ్లను చిరునవ్వుతో, ప్రేమగా పలకరించండి. మీరు ఆహ్వానించిన వాళ్లమీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే, కొత్తగా వచ్చిన ఇతరుల్ని కూడా పట్టించుకోండి. వీలైతే, మీ పక్కన కూర్చోబెట్టుకోండి
కొత్తవాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి రెడీగా ఉండండి
వచ్చిన నిష్క్రియుల్ని ప్రేమగా ఆహ్వానించడానికి ముందుండండి. ప్రత్యేకించి పెద్దలైతే, ఒకప్పుడు యెహోవాసాక్షులుగా ఉన్నవాళ్లను పలకరించడానికి చొరవ తీసుకుంటారు
యేసు ‘నశించినదానిని వెదకి రక్షించుటకు వచ్చెను’ వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
జ్ఞాపకార్థ ఆచరణకు నిష్క్రియులు వచ్చినప్పుడు, వాళ్లను ప్రేమగా పలకరించడం ఎందుకు ప్రాముఖ్యం?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) lfb లెసన్స్ 72-73