కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 సెప్టెంబరు పేజీలు 14-15
  • అక్టోబరు 28–నవంబరు 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 28–నవంబరు 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 సెప్టెంబరు పేజీలు 14-15

అక్టోబరు 28–నవంబరు 3

కీర్తనలు 103-104

పాట 30, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు”

(10 నిమి.)

కనికరం వల్ల యెహోవా సహేతుకత చూపిస్తాడు అంటే తన మాటే నెగ్గాలని పట్టుబట్టడు (కీర్త 103:8; w23.07 21వ పేజీ, 5వ పేరా)

మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన మనమీద ఆశ వదులుకోడు (కీర్త 103:9, 10; w23.09 6వ పేజీ, 16-18 పేరాలు)

మనం చేయగలిగే దానికన్నా ఆయన ఎక్కువ ఆశించడు (కీర్త 103:14; w23.05 26వ పేజీ, 2వ పేరా)

భార్య తన ఫీలింగ్స్‌ని చెప్తున్నప్పుడు భర్త శ్రద్ధగా వింటున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను నా భార్య లేదా భర్త మీద యెహోవాలానే సహేతుకత చూపిస్తున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 104:24—కొత్తవి, విభిన్నమైనవి సృష్టించే విషయంలో యెహోవాకున్న శక్తి గురించి ఈ లేఖనం ఏం చెప్తుంది? (cl 55వ పేజీ, 18వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 104:1-24 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 3వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీకి ఒప్పుకున్న వ్యక్తితో బైబిలు స్టడీకి స్వాగతం అనే వీడియో గురించి చర్చించండి. (th 9వ అధ్యాయం)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A 6వ పాయింట్‌—అంశం: భర్త “తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి.” (th 1వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 44

7. మీకు మీ పరిమితులు ఏంటో తెలుసా?

(15 నిమి.) చర్చ.

యెహోవాకు మన బెస్ట్‌ ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు, మనం కూడా సంతోషిస్తాం. (కీర్త 73:28) అయితే, మన పరిమితుల్ని తెలుసుకోకుండా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అనవసరమైన ఆందోళన, నిరాశ మిగులుతాయి.

“మనం చేయగలిగిన వాటిమీదే మనసుపెడితే ఇంకా ఎక్కువ చేయవచ్చు” వీడియోలో ఉన్న ఒక యౌవన సిస్టర్‌.

మనం చేయగలిగిన వాటిమీదే మనసుపెడితే ఇంకా ఎక్కువ చేయవచ్చు అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా మన నుండి ఏం కోరుతున్నాడు? (మీకా 6:8)

  • “మనం చేయగలిగిన వాటిమీదే మనసుపెడితే ఇంకా ఎక్కువ చేయవచ్చు” వీడియోలోని దృశ్యం. ఒక యౌవన సిస్టర్‌ తన ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌HR-.05లో బైబిలు విద్యార్థిని ప్రోత్సహిస్తుంది.
  • తన లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఆందోళనను తగ్గించుకోవడానికి యౌవన సహోదరికి ఏం సహాయం చేసింది?

మన పరిమితులను ఎలా తెలుసుకోవచ్చు?

  • ఇతరులతో పోల్చుకోకండి. (గల 6:4) కొన్నిసార్లు మీ వయసువాళ్లు లేదా మీలాంటి కుటుంబ పరిస్థితి ఉన్నవాళ్ల కన్నా మీరు ఎక్కువ సేవ చేయగలరు లేదా తక్కువ సేవ చేయగలరు. కాబట్టి ఇతరులు చేస్తున్నదాన్ని బట్టి లక్ష్యాలు పెట్టుకోకండి.

  • భయం వల్ల కొత్తవాటిని ప్రయత్నించడం ఆపకండి. (రోమా 12:1; 1కొ 7:31) ఏదైన ఒక సేవను మీరు చేయలేరని, దాన్ని ఆనందించలేరని అనిపించినా భయపడకండి, ఆ సేవను చేయడానికి ప్రయత్నించండి.—మలా 3:10

  • చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకుని మీ పరిమితులను తెలుసుకోండి. ఉదాహరణకు, మీరు క్రమ పయినీరుగా సేవ చేయగలరేమో ఆలోచించండి. ముందు, కొన్ని నెలలు పరిచర్యలో గడిపే సమయాన్ని పెంచుకోండి లేదా సహాయ పయినీరుగా సేవ చేయండి లేదా ఒక సంవత్సరం పాటు క్రమ పయినీరుగా సేవ చేసి చూడండి. అలా చేశాక ఒక సంవత్సరం కంటే ఎక్కువ చేయలేరని లేదా అసలు క్రమ పయినీరుగానే సేవ చేయలేరని అనిపించినా ఏం ఫర్లేదు, మీరు పెట్టుకున్న చిన్నచిన్న లక్ష్యాల్ని సాధించినందుకు మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.—ప్రసం 6:9

  • మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన పరిస్థితులతో పాటు మన పరిమితులు కూడా మారుతుంటాయి. కాబట్టి మీ లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 17వ అధ్యాయంలో 8-12 పేరాలు, 137వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 55, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి