జూలై 22-28
కీర్తనలు 66-68
పాట 7, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యెహోవా ప్రతీరోజు మన భారాలు మోస్తున్నాడు
(10 నిమి.)
యెహోవా మన ప్రార్థనలు విని వాటికి జవాబిస్తాడు (కీర్త 66:19; w23.05 12వ పేజీ, 15వ పేరా)
నిస్సహాయుల అవసరాల్ని యెహోవా పట్టించుకుంటాడు (కీర్త 68:5; w11 4/1 31వ పేజీ, 5వ పేరా; w09 10/1 18వ పేజీ, 1వ పేరా)
ప్రతీరోజు యెహోవా మనకు సహాయం చేస్తాడు (కీర్త 68:19; w23.01 19వ పేజీ, 17వ పేరా)
దీని గురించి ఆలోచించండి: మన భారాల్ని మోసే అవకాశాన్ని యెహోవాకు ఎలా ఇవ్వవచ్చు?
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 68:18—ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, “మనుష్యుల” రూపంలో ఉన్న “కానుకలు” ఎవరు? (w06 6/1 10వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 66:1-20 (th 11వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి దేశం, భాష, సంస్కృతి మనది కాదు. (lmd 5వ పాఠంలో 3వ పాయింట్)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. పోయినసారి కలిసినప్పుడు ఇచ్చిన కరపత్రం ఉపయోగించి మాట్లాడండి. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
పాట 102
7. ఇతరుల భారాన్ని మీరు తేలిక చేయగలరా?
(15 నిమి.) చర్చ.
దేవుని సేవకులు ఎవ్వరూ కష్టాల్ని ఒంటరిగా ఎదుర్కోవల్సిన అవసరం లేదు. (2ది 20:15; కీర్త 127:1) యెహోవా మనకు సహాయం చేస్తాడు. (యెష 41:10) ఏయే విధాలుగా? తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా మనకు నిర్దేశాలు ఇస్తాడు. (యెష 48:17) బలమైన తన పవిత్రశక్తిని ఇస్తాడు. (లూకా 11:13) మనల్ని ప్రోత్సహించేలా, కావాల్సిన సహాయం చేసేలా బ్రదర్స్-సిస్టర్స్‌ని కూడా కదిలిస్తాడు. (2కొ 7:6) తోటి క్రైస్తవుల భారాన్ని తగ్గించడానికి యెహోవా మనలో ఎవరినైనా ఉపయోగించుకోవచ్చని దీన్నిబట్టి అర్థమౌతుంది.
సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—వృద్ధుల మీద అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
వృద్ధ సహోదర సహోదరీల భారాన్ని తగ్గించేలా మీరు ఏం చేయవచ్చు?
సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—పూర్తికాల సేవకుల మీద అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
పూర్తికాల సేవకుల భారాన్ని తగ్గించేలా మీరు ఏం చేయవచ్చు?
సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—పరదేశుల మీద అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ల భారాన్ని తేలిక చేయడానికి మీరు ఏం చేయవచ్చు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 13వ అధ్యాయంలో 1-7 పేరాలు, 5వ సెక్షన్ పరిచయం అలాగే 103వ పేజీ బాక్సు