ఏప్రిల్ 29–మే 5
కీర్తనలు 34-35
పాట 10, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. ‘ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించండి’
(10 నిమి.)
దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా యెహోవాను స్తుతించాడు (కీర్త 34:1; w07 3/1 22వ పేజీ, 11వ పేరా)
దావీదు తనను బట్టి కాదుగానీ, యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకున్నాడు (కీర్త 34:2-4; w07 3/1 22వ పేజీ, 13వ పేరా)
దావీదు స్తుతించడం చూసి, ఆయన స్నేహితులు కూడా బలం పొందారు (కీర్త 34:5; w07 3/1 23వ పేజీ, 15వ పేరా)
దావీదు అబీమెలెకు నుండి తప్పించుకున్న తర్వాత, సౌలు పాలన కింద నలిగిపోతున్న 400 మంది పురుషులు, ఎడారిలో ఉన్న దావీదు దగ్గరికి చేరారు. (1స 22:1, 2) ఈ కీర్తనను కూరుస్తున్నప్పుడు దావీదు మనసులో వాళ్లే ఉండి ఉండొచ్చు.—కీర్త 34, పైవిలాసం.
ఇలా ప్రశ్నించుకోండి, ‘తర్వాతి మీటింగ్‌లో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, నేనెలా యెహోవాను స్తుతించవచ్చు?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 35:19—‘నన్ను ద్వేషిస్తున్నవాళ్ల కళ్లను గీటనివ్వకు’ అని దావీదు చేసిన విన్నపానికి అర్థమేంటి? (w06 5/15 20వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 34:1-22 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(2 నిమి.) అనియత సాక్ష్యం. మీరు సాక్ష్యం ఇచ్చేలోపే సంభాషణ ఆగిపోతుంది. (lmd 1వ పాఠంలో 4వ పాయింట్)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్)
6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు
(5 నిమి.) ప్రదర్శన. ijwfq 59—అంశం: ఫలానా పండుగ చేసుకోవచ్చో లేదో యెహోవాసాక్షులు ఎలా నిర్ణయించుకుంటారు? (th 17వ అధ్యాయం)
పాట 59
7. మీటింగ్స్‌లో యెహోవాను స్తుతించడానికి మూడు మార్గాలు
(15 నిమి.) చర్చ.
మీటింగ్స్‌లో యెహోవాను స్తుతించే మంచిమంచి అవకాశాలు దొరుకుతాయి. వాటిలో మూడిటిని పరిశీలించండి.
మాటలు: బ్రదర్స్-సిస్టర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, యెహోవా మంచితనం గురించి చెప్పండి. (కీర్త 145:1, 7) మీరు విన్న లేదా చదివిన ఏదైనా విషయం మీకు ఉపయోగపడిందా? ప్రీచింగ్‌లో మంచి అనుభవం ఎదురైందా? ఎవరైనా తమ మాటలతో లేదా పనులతో మిమ్మల్ని ప్రోత్సహించారా? సృష్టిలో ఏదైనా విషయం మిమ్మల్ని ఆకట్టుకుందా? అవన్నీ యెహోవా ఇచ్చిన బహుమతులే. (యాకో 1:17) వీటి గురించి మాట్లాడుకోవడానికి సమయం ఉండేలా, మీటింగ్‌కి కొన్ని నిమిషాలు ముందే రండి.
కామెంట్స్: ప్రతీ మీటింగ్‌లో కనీసం ఒక్క కామెంట్ అయినా చెప్పడానికి ప్రయత్నించండి. (కీర్త 26:12) మీరు ప్రశ్నకు సూటైన జవాబు ఇవ్వవచ్చు. లేదా పేరాలో ఉన్న వేరే విషయం మీద, లేఖనం మీద, చిత్రం మీద కామెంట్ చేయవచ్చు, సమాచారాన్ని ఎలా పాటించవచ్చో చెప్పవచ్చు. మీలానే వేరేవాళ్లు కూడా చేతులు ఎత్తుతారు కాబట్టి, ఎక్కువ కామెంట్స్ సిద్ధపడండి. మీ కామెంట్స్ 30 సెకన్లు లేదా అంతకన్నా తక్కువసేపు ఉంటే, “దేవునికి స్తుతి బలిని” అర్పించే అవకాశం ఎక్కువమందికి దొరుకుతుంది.—హెబ్రీ 13:15.
పాటలు: రాజ్యగీతాల్ని ఉత్సాహంగా పాడండి. (కీర్త 147:1) ముఖ్యంగా పెద్ద సంఘంలో, మీకు ప్రతీ మీటింగ్‌లో కామెంట్ చెప్పే అవకాశం రాకపోవచ్చు కానీ పాటలు పాడే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. మీరు మంచి సింగర్ కాకపోయినా, పాడడానికి చేయగలిగింది చేస్తే యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా! (2కొ 8:12) మీరు ఇంటి దగ్గరే పాటల్ని ప్రాక్టీసు చేయవచ్చు.
మన సంస్థ చరిత్రలోని కొన్ని పేజీలు—సంగీతం—ఒక వరం, 1వ భాగం అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
మొదట్లో మన సంస్థ యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడడం ప్రాముఖ్యమని ఎలా చూపించింది?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 9వ అధ్యాయంలో 1-7 పేరాలు, 3వ సెక్షన్ పరిచయం, అలాగే 70వ పేజీ బాక్సు