కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 11
  • నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • బాధగా అనిపించినప్పుడు యెహోవా మీకు సహాయం చేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • “దేవునికి దగ్గరవ్వడం” మనకు మంచిది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 11

మన క్రైస్తవ జీవితం

నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు

మనందరం ఎప్పుడోకప్పుడు బాధపడతాం. అలా బాధపడుతున్నామంటే దేవుని మీద విశ్వాసం తగ్గిందని కాదు. ఎందుకంటే, యెహోవా కూడా కొన్నిసార్లు బాధపడ్డాడు. (ఆది 6:5, 6) కానీ మీరు తరచూ లేదా ఎప్పుడూ బాధలోనే మునిగిపోతే అప్పుడేంటి?

సహాయం కోసం యెహోవావైపు చూడండి. మన ఫీలింగ్స్‌ని, మనసులో ఉన్న ఆలోచనల్ని యెహోవా పట్టించుకుంటాడు. మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నామో, ఎప్పుడు బాధగా ఉన్నామో యెహోవాకు తెలుసు. మనం ఫలానా విధంగా ఎందుకు ఆలోచిస్తున్నామో, మనకు ఎందుకు అలా అనిపిస్తుందో కూడా ఆయన అర్థంచేసుకుంటాడు. (కీర్త 7:9బి) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాకు మనమంటే చాలా పట్టింపు ఉంది. అలాగే మనం బాధ నుండి లేదా కృంగుదల నుండి బయటపడడానికి ఆయన సహాయం చేస్తాడు.—కీర్త 34:18.

మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిరాశలో ఉన్నప్పుడు లేదా డీలా పడినప్పుడు, మన సంతోషం ఆవిరైపోవడమే కాదు, యెహోవాతో మనకున్న స్నేహం కూడా దెబ్బతినవచ్చు. అందుకే మన హృదయాన్ని, ఆలోచనల్ని భద్రంగా కాపాడుకోవాలి.—సామె 4:23.

మన సహోదరులు శాంతిగా ఉన్నారు . . . డిప్రెషన్‌లో ఉన్నా వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • డిప్రెషన్‌ను తట్టుకోవడానికి నిక్కీ ఏయే పనులు చేసింది?

  • డాక్టర్‌ సహాయం తీసుకోవాలని నిక్కీకి ఎందుకు అనిపించింది?—మత్త 9:12

  • సహాయం కోసం నిక్కీ యెహోవా మీద ఏయే విధాలుగా ఆధారపడింది?

“కావలికోట” నం. 1 2023, అంశం “మానసిక ఆరోగ్యం కాపాడుకోండి​—ఎలా?”

కావలికోట నం. 1 2023 పత్రిక నుండి ప్రయోజనం పొందేవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?

మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏయే పనులు చేయవచ్చు?

(ఈ కింది వాటిలో మీరు ఏ పనుల్ని ఇంకా బాగా చేయాలనుకుంటున్నారో టిక్‌ పెట్టుకోండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి