మన క్రైస్తవ జీవితం
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని వీడియోలు, ప్రశ్నలు బాగా ఉపయోగపడుతున్నాయా? “కొంతమంది ఇలా అంటారు,” “ఇలా చేసి చూడండి,” “ఇవికూడా చూడండి” భాగాలు ఎలా అనిపిస్తున్నాయి? శిష్యుల్ని చేయడానికి మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, మీకు ఉపయోగపడే ఇంకొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.—మత్త. 28:19, 20.
మీడియా: మీరు ముద్రిత కాపీ నుండి స్టడీ చేయాలనుకుంటే వీడియోలన్నీ అలాగే ఇతర రెఫరెన్సులన్నీ ఒకేచోట కనిపించాలంటే ఏం చేయాలి? మీ ఫోన్లో గానీ, ట్యాబ్‌లో గానీ ఈ పుస్తకం తెరిచి ఏదోక సెక్షన్‌ను సెలక్ట్ చేయండి. పాఠాల లిస్టు చివర్లో ఆ సెక్షన్‌కు సంబంధించిన రెఫరెన్సులు అన్నీ ఉంటాయి. (1వ చిత్రం చూడండి.)
“ముద్రిత ప్రతి” సెట్టింగ్: మీరు ఎలక్ట్రానిక్ కాపీ నుండి స్టడీ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో “ముద్రిత ప్రతి” సెట్టింగ్ ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ సెట్టింగ్ కావాలంటే ఏం చేయాలి? మీరు స్టడీ చేస్తున్న పాఠం తెరిచాక, స్క్రీన్ కుడివైపున పైభాగంలో ఉన్న మూడు చుక్కల్ని క్లిక్ చేయండి. అందులో “ముద్రిత ప్రతి” సెట్టింగ్ సెలక్ట్ చేయండి. మీరు స్టడీ చేస్తున్న సమాచారం ఆ పాఠం అంశంతో ఎలా ముడిపడివుందో అర్థంచేసుకోవడానికి ఈ సెట్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్ నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? మళ్లీ పైనున్న మూడు చుక్కల్ని క్లిక్ చేసి “డిజిటల్ ప్రతి” సెలక్ట్ చేయండి.
“నేను సిద్ధంగా ఉన్నానా?”: పుస్తకం చివర్లో ఉన్న ఈ బాక్సు, సంఘంతో కలిసి ప్రకటన పని చేయడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు చేయాల్సిన పనుల్ని తెలియజేస్తుంది. (2వ చిత్రం చూడండి.)
అదనపు సమాచారం: కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన ఎక్కువ విషయాలు ఈ భాగంలో ఉంటాయి. అదనపు సమాచారం కిందవున్న లింక్ మీద క్లిక్ చేస్తే మీరు స్టడీ చేస్తున్న పాఠానికి తిరిగివెళ్లవచ్చు. (2వ చిత్రం చూడండి.)
ఈ పుస్తకం పూర్తవకముందే మీరు స్టడీ చేస్తున్న వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే స్టడీ అక్కడితో ఆపేయాలా? లేదు. వాళ్లు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ ఈ పుస్తకం పూర్తయ్యేదాకా వాళ్లతో స్టడీ చేయండి. ఆ స్టడీని, రిటన్ విజిట్లను, గంటల్ని మీరు రిపోర్టు చేయవచ్చు. మీతో పాటు ఆ స్టడీకి వచ్చిన ప్రచారకుడు లేదా ప్రచారకురాలు కూడా ఆ టైమ్‌ను రిపోర్టు చేసుకోవచ్చు