దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు ఎంత కాలం రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతుంటారు?”
ఏదోక నిర్ణయం తీసుకోమని ఏలీయా ఇశ్రాయేలీయులకు చెప్పాడు (1రా 18:21; w17.03 14వ పేజీ, 6వ పేరా)
బయలు దేవుడు కాదు, జీవంలేని ఒక విగ్రహం మాత్రమే (1రా 18:25-29; ia 102వ పేజీ, 15వ పేరా)
యెహోవా తాను మాత్రమే దేవుణ్ణని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో నిరూపించాడు (1రా 18:36-38; ia 104వ పేజీ, 18వ పేరా)
యెహోవా నియమాల్ని పాటించడం ద్వారా తమ విశ్వాసాన్ని చూపించమని ఏలీయా ప్రజల్ని ప్రోత్సహించాడు. (ద్వితీ 13:5-10; 1రా 18:40) నేడు మనం కూడా యెహోవా నియమాల్ని తూ.చ తప్పకుండా పాటించడం ద్వారా మన విశ్వాసాన్ని, దైవభక్తిని చూపించవచ్చు.