మన క్రైస్తవ జీవితం
పెళ్లి జీవితకాల అనుబంధం
అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు సంతోషంగా ఉండడంతో పాటు యెహోవాకు కూడా మహిమ తీసుకొస్తారు. (మార్కు 10:9) పెళ్లి చేసుకోబోయే వాళ్లెవరైనా, తమ భర్తతో లేదా భార్యతో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నిటినీ కలిసి ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటారు. ఆ కోరిక నిజమవ్వాలంటే, తమ జతను ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా బైబిలు సూత్రాల్ని మనసులో ఉంచుకోవాలి.
‘యౌవనప్రాయం దాటిపోయాకే’ పెళ్లి గురించి ఆలోచించడం మంచిది. యౌవనంలో ఉన్నప్పుడైతే లైంగిక కోరికలు బలంగా ఉంటాయి కాబట్టి, జతను ఎంచుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. (1కొ 7:36) పెళ్లవ్వడానికి ముందు మీకున్న సమయాన్ని ఉపయోగించుకుని దేవునితో మీ బంధాన్ని బలపర్చుకోండి, మంచి లక్షణాల్ని పెంచుకోండి. ఇలా చేస్తే, పెళ్లయ్యాక మీరొక మంచి భర్తగా లేదా మంచి భార్యగా ఉండగలుగుతారు. మీ వివాహ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
పెళ్లి చేసుకుంటానని ఎవరికైనా మాటిచ్చే ముందు సమయం తీసుకుని వాళ్ల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి. (1పే 3:4) వాళ్లలో మీకు ఇబ్బందిపెట్టే విషయాలు ఏమైనా ఉంటే మనసువిప్పి మాట్లాడుకోండి. ఒకరితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక, వాళ్ల నుండి మీరేం పొందుతారు అనే దానిగురించి కాకుండా, మీరు వాళ్లకు ఏం ఇవ్వగలరు అనే దానిగురించే ఎక్కువ ఆలోచించాలి. (ఫిలి 2:3, 4) ఆ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే మీరు బైబిలు సూత్రాల్ని పాటిస్తే పెళ్లి చేసుకున్నాక మీ జీవితం సంతోషంగా ఉంటుంది.
పెళ్లి కోసం సిద్ధపడడం—3వ భాగం:‘ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోండి’ వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
డేటింగ్ మొదలుపెట్టిన కొత్తలో షాన్‌తో సమయం గడుపుతున్నప్పుడు ఆ సహోదరికి ఎలా అనిపించింది?
రోజులు గడిచేకొద్దీ ఆ సహోదరి ఎలాంటి విషయాలు గమనించింది?
ఆ సహోదరి అమ్మానాన్నలు ఆమెకు ఎలా సహాయం చేశారు? ఆమె ఎలాంటి తెలివైన నిర్ణయం తీసుకుంది?