మన క్రైస్తవ జీవితం | కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి
రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేసుకోండి
రాజ్య సువార్తికుల కోసం పాఠశాల (SKE) లక్ష్యం పెట్టుకోవాలంటే, మీ జీవితంలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాల్సిన అవసరంలేదు. మీకు ఉండాల్సిన ముఖ్యమైన అర్హతల్లో రెండు ఏంటంటే: 1. మీకు యెహోవాతో బలమైన సంబంధం ఉండాలి, 2. ఏ నియామకం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.—యెష 6:8.
విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి—రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేయండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
నిర్ణయం తీసుకునే విషయంలో గాబ్రియేల్ ఎందుకు ఆలస్యం చేశాడు? ఫిలిప్పీయులు 4:13 ధ్యానించాక అతను ఏ ప్రయోజనం పొందాడు?