కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 7
  • మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ప్రపంచవ్యాప్త ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే విద్యార్థులున్న ఒక పాఠశాల
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పయినీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి పాఠశాలలు ఉన్నాయి?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 7
కొంతమంది విద్యార్థులు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు హాజరయ్యారు.

మన క్రైస్తవ జీవితం

మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?

మీకు 23 నుండి 65 ఏళ్ల వయసు ఉండి పూర్తికాల సేవ చేస్తున్నారా? మీకు మంచి ఆరోగ్యం ఉందా? అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయాలనే కోరిక ఉందా? అయితే, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లడం గురించి ఆలోచించారా? ఈ పాఠశాల మొదలైనప్పటి నుండి వేలమంది దంపతులు, పెళ్లికాని సహోదరులు, పెళ్లికాని సహోదరీలు అప్లికేషన్‌ పెట్టారు. అవసరం చాలా ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువమంది పెళ్లికాని సహోదరులు అప్లికేషన్‌ పెట్టాలని ప్రోత్సహిస్తున్నాం. తనను సంతోషపెట్టాలనే, తన కుమారుడిని అనుకరించాలనే కోరికను మీలో పెంచమని యెహోవాను అడగండి. (కీర్త 40:8; మత్త 20:28; హెబ్రీ 10:7) అర్హత సాధించేందుకు వీలుగా ఉద్యోగపరమైన లేదా వ్యక్తిగత బాధ్యతల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఈ పాఠశాల ద్వారా శిక్షణ పొందినవాళ్లు ఏయే పద్ధతుల్లో, ప్రాంతాల్లో సేవ చేయగలిగారు? కొందరు వేరే భాషా క్షేత్రాల్లో సేవచేస్తున్నారు, ఇంకొందరు ప్రత్యేక మెట్రోపాలిటన్‌ బహిరంగ సాక్ష్యంలో పాల్గొంటున్నారు. కొందరు సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకులుగా, ప్రాంతీయ పర్యవేక్షకులుగా, ఫీల్డ్‌ మిషనరీలుగా సేవచేస్తున్నారు. యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకుంటున్న మీరు, యెషయా ప్రవక్త అన్న ఈ మాటల్ని మనసులో ఉంచుకోండి: “నేనున్నాను! నన్ను పంపు!”—యెష 6:8.

కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ‘కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు’ వీడియోలోని సన్నివేశం. ఫీల్డ్‌ మిషనరీలుగా సేవ చేస్తున్న ఒక జంట మంచివార్త ప్రకటించడానికి ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు.

    క్షేత్ర మిషనరీలను ఎలా ఎంపిక చేస్తారు?

  • ‘కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు’ వీడియోలోని సన్నివేశం. ఫీల్డ్‌ మిషనరీ అయిన ఒక సహోదరి, మరో సహోదరితో కలిసి ఒకామెకు స్టడీ చేస్తోంది.

    ఫీల్డ్‌ మిషనరీలు ఎలాంటి చక్కని పని చేస్తున్నారు?

  • ‘కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు’ వీడియోలోని సన్నివేశం. సంజ్ఞా భాష క్షేత్రంలో ఫీల్డ్‌ మిషనరీగా సేవ చేస్తున్న ఒక సహోదరుడు ప్రత్యేక సేవకు సంబంధించిన అప్లికేషన్‌ గురించి మరో సహోదరునితో మాట్లాడుతున్నాడు.

    మిషనరీ సేవ చేయడం వల్ల పొందే దీవెనల్లో కొన్ని ఏంటి?

రాజ్య సువార్తికుల కోసం పాఠశాల గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? jw.org వెబ్‌సైట్‌లోని లైబ్రరీ సెక్షన్‌లో, “వీడియోలు” విభాగానికి వెళ్లి, మా కార్యకలాపాలు > దైవపరిపాలనా పాఠశాలలు, శిక్షణ చూడండి. యెహోవా బోధతో ఆధ్యాత్మిక ధనవంతులం అయ్యాం వీడియో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి