కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 11
  • మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగత్రాగాలని కలిగే వత్తిడిని నేనెలా ఎదిరించగలను?
    తేజరిల్లు!—1992
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 11

మన క్రైస్తవ జీవితం

మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి

మనం అపరిపూర్ణులం కాబట్టి కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ పోరాడుతూ ఉంటాం. ఒకవేళ వాటిని అదుపులో ఉంచుకోకపోతే యెహోవా ఆమోదాన్ని కోల్పోతాం. ఉదాహరణకు, కొంతమంది ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని దేవునికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకొంతమంది, లైంగిక కోరికల్ని తీర్చుకోవడానికి దేవుని ప్రమాణాల్ని సైతం పక్కన పెట్టేస్తారు. (రోమా 1:26, 27) ఇంకొందరు తోటివాళ్లు తమను ఇష్టపడాలి, కలుపుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ల ఒత్తిడికి లొంగిపోతారు.—నిర్గ 23:2.

మరి, మన కోరికల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? మనం యెహోవా ఇష్టపడే వాటిని చేయడం పైనే మనసుపెట్టాలి. (మత్త 4:4) అంతేకాదు, కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే మనకు ఏది మంచిదో, మన కోరికల్ని ఎలా తీర్చాలో ఆయనకే తెలుసు.—కీర్త 145:16.

సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • “సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి” వీడియోలోని ఒక సన్నివేశం. సిగరెట్లు తాగుతున్నట్లు ఉన్న బొమ్మలు ఒక మెషీన్‌ నుండి వరుసగా బయటకు వస్తున్నాయి.

    కొంతమంది ఎందుకు సిగరెట్‌ కాలుస్తారు?

  • “సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి” వీడియోలోని ఒక సన్నివేశం. సిగరెట్‌ తాగే వ్యక్తి ఊపిరితిత్తులు విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నాయి.

    సిగరెట్‌ కాలిస్తే మన ఆరోగ్యానికి ఏమౌతుంది?

  • “సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి” వీడియోలోని ఒక సన్నివేశం. సాధారణ మనిషి కన్నా చాలా పెద్దగా ఉన్న ఒక వ్యాపారవేత్త, చేపలు పట్టే గాలానికి ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ తగిలించి దాన్ని ఒక యువతికి ఎరగా వేస్తున్న కార్టూన్‌ చిత్రం.

    సిగరెట్లు కాల్చడం, ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు తాగడం (vaping) ఎందుకు తప్పు?—2కొ 7:1

  • “సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి” వీడియోలోని ఒక సన్నివేశం. ఒక యువతి బిల్డింగ్‌ మీద నిలబడి పగటిపూట ఆకాశంలోకి చూస్తోంది.

    సిగరెట్‌ తాగాలనే కోరికను మీరు తీసేసుకోవచ్చు

    సిగరెట్‌ ముట్టుకోనని మీరెలా చెప్పవచ్చు? ఒకవేళ సిగరెట్‌ అలవాటు ఉంటే దాన్నెలా మానుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి