కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 9
  • మీరు ఆన్‌లైన్‌లో ఎవరితో స్నేహం చేస్తున్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఆన్‌లైన్‌లో ఎవరితో స్నేహం చేస్తున్నారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మన అధికారిక వెబ్‌సైట్‌—వ్యక్తిగత, కుటుంబ అధ్యయనం కోసం ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2012
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • నిజమైన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి
    తేజరిల్లు!—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 9

మన క్రైస్తవ జీవితం

మీరు ఆన్‌లైన్‌లో ఎవరితో స్నేహం చేస్తున్నారు

ఒకరి మీద ఒకరు ప్రేమాగౌరవాలు చూపించుకుంటూ కలిసి ఉండే వ్యక్తుల్ని స్నేహితులు అంటారు. ఉదాహరణకు దావీదు గొల్యాతును చంపాక, దావీదు యోనాతానుల మధ్య స్నేహం చిగురించి, అది ఎవరూ విడదీయలేనంత బలంగా మారింది. (1స 18:1) వాళ్లలో ఉన్న లక్షణాలే వాళ్లిద్దర్నీ దగ్గర చేశాయి. కాబట్టి మీ స్నేహితుల గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీ స్నేహం అంత ఎక్కువ బలపడుతుంది. సాధారణంగా ఒకరినొకరు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, దానికి చాలా కృషి కూడా చేయాలి. కానీ, ప్రస్తుతం సోషల్‌ నెట్‌వర్క్‌లో కేవలం ఒక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తో స్నేహితులు అయిపోతున్నారు. ఆన్‌లైన్‌లో మనతో మాట్లాడేవాళ్లు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టడం చాలా తేలిక. వాళ్లపై మనకు మంచి అభిప్రాయం కలిగేలా చేయడం వాళ్ల చేతిలో పనే. అందుకే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసేముందు అవతలి వ్యక్తి ఎలాంటివాళ్లో ఆలోచించండి. పరిచయం లేనివాళ్లు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించినప్పుడు దాన్ని రిజెక్ట్‌ చేస్తే వాళ్లు బాధపడతారేమో అని ఆలోచించకండి. సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలు తెలిసినవాళ్లు, దానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ మీరు సోషల్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించాలనుకుంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • “సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి” వీడియోలో ఒక సన్నివేశం. టీవీలో తన ఫోటో చూసి ఒకమ్మాయి షాక్‌ అవుతోంది.

    కామెంట్లు, ఫోటోలు పోస్ట్‌ చేసేముందు మీరు ఏ విషయాల గురించి ఆలోచించాలి?

  • “సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి” వీడియోలో ఒక సన్నివేశం. త్రాసు మీద ఒకవైపు అందంగా కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది, మరోవైపు డబ్బులు పేర్చివున్నాయి. ఆ డబ్బుల కన్నా అమ్మాయి ఫోటేనే ఎక్కువ బరువు తూగింది.

    ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ను ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

  • “సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి” వీడియోలో ఒక సన్నివేశం. మొరటుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక అబ్బాయికి సోషల్‌ మీడియాలో ఉన్న పోస్ట్‌ చూపిస్తుంటే, అతను కళ్లు మూసుకుంటున్నాడు.

    సోషల్‌ నెట్‌వర్క్‌లో ఎంత టైమ్‌ గడపాలో లిమిట్‌ పెట్టుకోవడం ఎందుకు ముఖ్యం?—ఎఫె 5:15, 16

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి