మన క్రైస్తవ జీవితం
సమూయేలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
సమూయేలు జీవితాంతం యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. పిల్లవాడైన సమూయేలు ఏలీ కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసుల్లా చెడ్డపనులు చేయడానికి ఇష్టపడలేదు. (1స 2:22-26) సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. (1స 3:19) అతని కుమారులు యెహోవా మార్గాల్లో నడవకపోయినా, అతను వృద్ధాప్యం వరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు.—1స 8:1-5.
సమూయేలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకవేళ మీరు యౌవనులైతే మీరు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటున్నారో, మీకు ఎలా అనిపిస్తుందో యెహోవా తప్పకుండా అర్థంచేసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండేలా ఆయన సహాయం చేస్తాడు. (యెష 41:10, 13) ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లలు యెహోవా సేవను ఆపేసినప్పుడు బాధగా అనిపిస్తుంది. అయితే, సమూయేలు తన ఎదిగిన కుమారుల్ని యెహోవా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే అని బలవంతపెట్టలేదు. దీని గురించి ఆలోచించినప్పుడు మీకు ఓదార్పుగా అనిపిస్తుంది. విషయాన్ని సమూయేలు యెహోవాకు అప్పగించాడు. అదే సమయంలో తన యథార్థతను కాపాడుకున్నాడు, పరలోక తండ్రిని సంతోషపెట్టాడు. మీరు చూపించే మంచి ఆదర్శం వల్ల మీ పిల్లలు యెహోవా దగ్గరకు మళ్లీ తిరిగి రావచ్చు.
వాళ్ల నుండి నేర్చుకోండి—సమూయేలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు ధైర్యాన్ని ఎలా చూపించాడు?
డానీ ధైర్యాన్ని ఎలా చూపించాడు?
సమూయేలు వృద్ధుడిగా ఉన్నప్పుడు ఎలా మంచి ఆదర్శాన్ని ఉంచాడు?
సరైనది చేయాలని స్థిరంగా కోరుకునే వాళ్లకు యెహోవా మద్దతు ఉంటుంది
డానీ తల్లిదండ్రులు ఎలా మంచి ఆదర్శాన్ని ఉంచారు?