మన క్రైస్తవ జీవితం
“ఎన్నడూ ఆందోళనపడకండి”
ప్రాచీన కాలంలోని పేదవాళ్లయిన ఇశ్రాయేలీయులకు యెహోవా సహాయం చేశాడు. మరి, మనకాలంలో పేదవాళ్లయిన తన సేవకులకు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేస్తాడు?
డబ్బు మీద ఆశ పెంచుకోకుండా, సంతృప్తిగా జీవించడం మనకు నేర్పించాడు.—లూకా 12:15; 1తి 6:6-8
ఆత్మగౌరవంతో జీవించడానికి మనకు సహాయం చేశాడు.—యోబు 34:19
కష్టపడి పనిచేయమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండమని మనకు నేర్పించాడు.—సామె 14:23; 20:1; 2కొ 7:1
ప్రేమ చూపించే సహోదరసహోదరీలను మనకిచ్చాడు.—యోహా 13:35; 1యో 3:17, 18
మనలో ఆశ నింపాడు.—కీర్త 9:18; యెష 65:21-23
మనం ఎంత పెద్ద కష్టంలో ఉన్నా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. (యెష 30:15) ఎందుకంటే, యెహోవా రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చినంత కాలం ఆయన మన అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు.—మత్త 6:31-33.
చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . . పేదరికంలో ఉన్నా—కాంగో వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
ప్రాదేశిక సమావేశ స్థలానికి దగ్గర్లో ఉండే సహోదరసహోదరీలు, దూరం నుండి వచ్చే వాళ్లకోసం ప్రేమతో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
పేదవాళ్ల పట్ల యెహోవాకున్న ప్రేమ గురించి ఈ వీడియో ఏం నేర్పిస్తుంది?
మన ఆర్థిక స్తోమత ఏదైనా, యెహోవాను మనం ఎలా అనుకరించవచ్చు?