దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 4-5
యెహోవాకు మీ దగ్గరున్న శ్రేష్ఠమైనది ఇవ్వండి
ఇశ్రాయేలీయులు యెహోవాతో శాంతియుత సంబంధం కలిగివుండడానికి పేదరికం అడ్డురాలేదు. వాళ్లలో పేదవాళ్లు కూడా యెహోవాను సంతోషపెట్టే అర్పణను ఇవ్వవచ్చు, కాకపోతే అది శ్రేష్ఠమైనదై ఉండాలి. అలాంటివాళ్లు మెత్తని పిండి ఇవ్వవచ్చు, కానీ అది అతిథుల కోసం ఉపయోగించేలాంటి శ్రేష్ఠమైనదై ఉండాలని యెహోవా కోరుకున్నాడు. (ఆది 18:6) నేడు కూడా యెహోవా మన నుండి శ్రేష్ఠమైనది కోరుతున్నాడు. అయితే, మనం ఆయనకు ఎక్కువ ఇవ్వలేకపోయినా, మనం అర్పించే “స్తుతి బలి” శ్రేష్ఠమైనదైతే ఆయన దాన్ని అంగీకరిస్తాడు.—హెబ్రీ 13:15.
బహుశా ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల లేదా శక్తి తగ్గిపోవడం వల్ల, మీరు ఇంతకుముందులా సేవ చేయలేకపోతుంటే ఇది మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?