కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 3
  • నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మీరు నేర్చుకొన్న వాటిని ఆచరిస్తూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మీకు వాస్తవాలు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇంటర్‌నెట్‌ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి!
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 3

మన క్రైస్తవ జీవితం

నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి

సూపర్‌ మార్కెట్‌లో ఉన్నప్పుడు తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ చూసి షాక్‌ అవుతున్న ఒక స్త్రీ.

ఈ రోజుల్లో సమాచారాన్ని కేవలం క్షణాల్లో లక్షలమందికి చేరవేయవచ్చు. అది పేపరు, పత్రికల ద్వారా కావచ్చు, లేదా రేడియో, టీవీ, ఇంటర్నెట్‌ ద్వారా కావచ్చు. “సత్య” దేవున్ని ఆరాధించేవాళ్లు కనీసం పొరపాటుగానైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయాలనుకోరు. (కీర్త 31:5; నిర్గ 23:1) అబద్ధాలు వ్యాప్తి చేయడం వల్ల చాలా హాని జరిగే అవకాశం ఉంది. ఏదైనా సమాచారం నిజమో కాదో నిర్ధారించుకుంటున్నప్పుడు వీటి గురించి ఆలోచించండి:

  • ‘ఈ సమాచారం చెప్పినవాళ్లు నమ్మదగినవాళ్లేనా?’ సమాచారం చెప్పేవాళ్లకు నిజాలన్నీ తెలిసుండకపోవచ్చు. ఏదైనా సమాచారాన్ని ఒకరు ఇంకొకరికి చెప్తున్నప్పుడు అందులోని కొన్ని విషయాలు మార్చి చెప్పవచ్చు. కాబట్టి ఆ సమాచారం ఎవరి దగ్గర నుండి వచ్చిందో ఖచ్చితంగా తెలియనప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో బాధ్యతలు ఉన్నవాళ్లు చెప్పే సమాచారాన్ని అందరూ నమ్ముతారు కాబట్టి, ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్తున్నప్పుడు అది నిజమో కాదు వాళ్లు నిర్ధారించుకోవాలి

  • ‘ఈ సమాచారం ఎవరి పేరునైనా పాడు చేస్తుందా?’ అది ఒకరి పేరును లేదా కొంతమంది పేరును పాడు చేస్తుంటే, దాన్ని ఇతరులకు చెప్పకపోవడమే మంచిది.—సామె 18:8; ఫిలి 4:8.

  • ‘ఈ సమాచారం నమ్మదగినదేనా?’ సంచలనాత్మకమైన విషయాలను, అనుభవాల్ని వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి

నేను పుకార్లను ఎలా ఆపవచ్చు? అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఒక అబ్బాయిని గుండ్రంగా ఉన్న బోర్డుకు కట్టేశారు, అతని చుట్టూ బోర్డుకు కత్తులు గుచ్చుకొని ఉన్నాయి.

    సామెతలు 12:18 ప్రకారం మాటలు ఎంత హాని చేయగలవు?

  • కొంతమంది గుమికూడి పుకార్లు పుట్టిస్తున్నారు.

    ఇతరుల గురించి ఏదైనా మాట్లాడే ముందు సరిగ్గా ఆలోచించడానికి ఫిలిప్పీయులు 2:4 ఎలా సహాయం చేస్తుంది?

  • ఒకతను చెప్తున్న పుకార్లను వినకుండా వెళ్లిపోతున్న ఇంకొకతను.

    ఇతరుల గురించి ఎవరైనా వెటకారంగా లేదా చెడుగా మాట్లాడితే మనం ఏం చేయాలి?

  • ఒకతను చెప్తున్న పుకార్లను రిపోర్టర్‌లా కనిపిస్తున్న మరొకతను రాసుకుంటున్నాడు.

    ఇతరుల గురించి ఏదైనా మాట్లాడే ముందు, మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి