దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 17-18
అణకువగల పురుషులు శిక్షణ ఇస్తారు, బాధ్యతలు అప్పగిస్తారు
తమకన్నా వయసులో చిన్నవాళ్లకు అనుభవంగల సహోదరులు అణకువతో, ప్రేమతో, ముందుచూపుతో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత బాధ్యతల్ని అప్పగిస్తారు. ఎలా?
మరిన్ని బాధ్యతలు చేపట్టగలిగే వాళ్లను ఎంపిక చేసుకోండి
ఒక పనిని పూర్తి చేయడానికి ఏమి అవసరమో స్పష్టంగా చెప్పండి
అప్పగించిన పనికి అవసరమైన డబ్బు, పనిముట్లు, లేదా సహాయాన్ని అందించండి
ఇచ్చిన పని ఎక్కడివరకు వచ్చిందో తెలుసుకుంటూ ఉండండి, మీరు శిక్షణ ఇస్తున్న వ్యక్తి ఆ పని పూర్తి చేయగలడనే మీ నమ్మకాన్ని వ్యక్తం చేయండి
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఇతరులకు ఏ బాధ్యతలు అప్పగించగలను?’