దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 4-5
“నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను”
యెహోవా సహాయంతో మోషే తన భయాల్ని అధిగమించాడు. యెహోవా మోషేకు చెప్పిన మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
మనం చేయలేనివాటి మీద మనసుపెట్టకూడదు
మన నియామకాల్ని పూర్తిచేయడానికి కావాల్సిన ప్రతీదాన్ని యెహోవా ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు
దేవుని మీదున్న విశ్వాసం మనుషులకు భయపడకుండా ఉండడానికి సహాయం చేస్తుంది
పరిచర్యలో ఆటంకాల్ని అధిగమించడానికి యెహోవా నాకు ఎలా సహాయం చేశాడు?