కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 7
  • “అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?
    యువత అడిగే ప్రశ్నలు
  • చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    తేజరిల్లు!—2017
  • యెహోవాను మాత్రమే ఆరాధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 7
ఒకతను మంత్రతంత్రాలకు సంబంధించిన పూసల దండ పడేస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం

“అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”

విగ్రహపూజ చేయకూడదనే ఆజ్ఞ అప్పటికింకా యెహోవా ఇవ్వకపోయినా, ఆయన సంపూర్ణ భక్తిని కోరే దేవుడని యాకోబు అర్థం చేసుకున్నాడు. (నిర్గ 20:3-5) అందుకే, యెహోవా అతన్ని బేతేలుకు తిరిగి వెళ్లమని చెప్పిన తర్వాత, యాకోబు తనతో ఉన్న వాళ్లందరితో విగ్రహాలు తీసిపారేయమని చెప్పాడు. అప్పుడు యాకోబు ఆ విగ్రహాల్ని, బహుశా తాయెత్తుల్లా ధరించిన చెవిపోగుల్ని పారేశాడు. (ఆది 35:1-4) యాకోబు చేసిన పనికి యెహోవా ఖచ్చితంగా సంతోషించివుంటాడు.

నేడు మనమెలా యెహోవాకు సంపూర్ణ భక్తిని ఇవ్వవచ్చు? మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని, విగ్రహపూజకు లేదా మంత్రతంత్రాలకు సంబంధించిన ప్రతీదానికి దూరంగా ఉండడం. అంటే, మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులన్నిటినీ పారేయాలి, అలాగే మన వినోదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు, ఇలా ప్రశ్నించుకోండి: ‘పిశాచాలు, భూతాలు, మానవాతీత శక్తులు వంటివి ఉన్న పుస్తకాల్ని లేదా సినిమాల్ని నేను ఆనందిస్తున్నానా? నేను చూసే వినోదంలో ఇంద్రజాలం, మంత్రం వేయడం, శాపం పెట్టడం వంటివాటిని కేవలం సరదా కోసం అన్నట్లు, వాటిలో ఏ హానీ లేదన్నట్లు చూపిస్తున్నారా?’ యెహోవా అసహ్యించుకునే ప్రతీదానికి మనం చాలా దూరంగా ఉండాలి.—కీర్త 97:10.

“అపవాదిని ఎదిరించండి” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ఒక బిడ్డ మంచం మీద పడుకొని ఉంది, చేతికి తాయెత్తు ఉంది. వెనక ఆ బిడ్డ తల్లి తనకు బైబిలు అధ్యయనం చేసే జంటతో మాట్లాడుతోంది.

    పలేస అనే బైబిలు విద్యార్థికి ఎలాంటి సమస్య వచ్చింది?

  • ఆ జంట, బైబిలు విద్యార్థి కలిసి ఇద్దరు పెద్దల సహాయం తీసుకుంటున్నారు.

    మంత్రతంత్రాల వల్ల సమస్య వస్తే, పెద్దల సహాయం తీసుకోవడం ఎందుకు తెలివైన పని?

  • ఆ బైబిలు విద్యార్థి తన బిడ్డ చేతికున్న తాయెత్తును మంటల్లో కాల్చేస్తుంది.

    అపవాదిని ఎదిరించండి, దేవునికి దగ్గరవ్వండి.—యాకో 4:7, 8

    మనకు యెహోవా కాపుదల కావాలంటే వేటిని వదిలించుకోవాలి?

  • పలేస ఎలాంటి చర్య తీసుకుంది?

  • మీరు ఉంటున్న ప్రాంతంలో, చెడ్డదూతల ప్రభావానికి దూరంగా ఉండడానికి ఏమేం చేయవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి