మన క్రైస్తవ జీవితం
భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?
అబ్రాహాము, శారా ఒకరిపట్ల ఒకరు ప్రేమ, గౌరవం చూపించుకోవడం ద్వారా భార్యాభర్తలకు మంచి ఆదర్శం ఉంచారు. (ఆది 12:11-13; 1పే 3:6) అయితే వాళ్ల వివాహ జీవితం సాఫీగా సాగిపోలేదు, వాళ్లు జీవితంలో కష్టాల్ని సహించాల్సి వచ్చింది. అబ్రాహాము, శారాల ఉదాహరణ పరిశీలించడం ద్వారా భార్యాభర్తలు ఏం నేర్చుకోవచ్చు?
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండండి. మీ భర్త లేదా భార్య చిరాకులో లేదా కోపంలో మిమ్మల్ని ఏమైనా అంటే బాధపడకండి, వాళ్లను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. (ఆది 16:5, 6) కలిసి సమయం గడిపేలా ఏర్పాటు చేసుకోండి. మీ భర్తను లేదా భార్యను మీరు ప్రేమిస్తున్నారని మీ మాటల ద్వారా, పనుల ద్వారా ఎప్పుడూ తెలియజేస్తూనే ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి బైబిల్ని అధ్యయనం చేయండి, ప్రార్థించండి, ఆరాధించండి. అలా యెహోవాతో మీ ఇద్దరికున్న సంబంధానికి మొదటి స్థానం ఇవ్వండి. (ప్రసం 4:12) వివాహం ఒక పవిత్రమైన ఏర్పాటు, భార్యాభర్తల బంధం బలంగా ఉంటే వివాహాన్ని స్థాపించిన యెహోవాకు ఘనత వస్తుంది.
వివాహ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు? అనే వీడియోను చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
ఈ వీడియోలో దిలీప్, జ్యోతిల మధ్య దూరం ఏర్పడుతోందని వేటిని బట్టి చెప్పవచ్చు?
వివాహ జీవితంలో దాపరికం లేకుండా మాట్లాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
అబ్రాహాము, శారాల ఉదాహరణ దిలీప్, జ్యోతిలకు ఎలా సహాయం చేసింది?
దిలీప్, జ్యోతి తమ వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
భార్యాభర్తలు ఒకరినుండి ఒకరు పరిపూర్ణతను ఎందుకు ఆశించకూడదు?
మీ వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవచ్చు!