దేవుని వాక్యంలో ఉన్న సంపద | యాకోబు 3-5
దేవుడిచ్చే తెలివిని చూపించండి
యెహోవా ఇచ్చే తెలివి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మనతోటి విశ్వాసులతో తిరిగి సమాధానపడడానికి సహాయం చేస్తుంది. మనం నిజంగా దేవుడు ఇచ్చే తెలివిని సంపాదించుకుంటే, అది మన ప్రవర్తనలో స్పష్టంగా కనబడుతుంది.
దేవుడు ఇచ్చే తెలివి:
స్వచ్ఛమైనది
శాంతికరమైనది
తన మాటే నెగ్గాలనే స్వభావం లేనిది
లోబడడానికి సిద్ధంగా ఉండేది
కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది
పక్షపాతం లేనిది
వేషధారణ లేనిది
ఇలా ఆలోచించండి: ‘దేవుడు ఇచ్చే తెలివి పుట్టించే లక్షణాల్లో నేను ఈ మధ్య దేన్ని చూపించాను? ఈ లక్షణాల్లో కొన్నిటిని ఇంకా బాగా చూపించడానికి నేను ఏం చేయాలి?’