కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 8
  • దేవుడు మర్చిపోని మంచి పనులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మర్చిపోని మంచి పనులు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • “దేవుని మందిరము”ను మెప్పుతో చూచుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 8
బెతెల్‌ కిచెన్‌లో పనిచేస్తున్న ఒక సహోదరి

మన క్రైస్తవ జీవితం

దేవుడు మర్చిపోని మంచి పనులు

యెహోవా ప్రజలు అందరూ దేవుని పవిత్ర సేవలో మంచి పనులు చేయగలరు. పిల్లల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వాళ్లు చేసే మంచి పనుల్ని ఎప్పటికీ మర్చిపోరు, అలానే యెహోవా కూడా మనం చేసే పనుల్ని, ఆయన పేరు కోసం మనం చూపించే ప్రేమను మర్చిపోడు. (మత్త 6:20; హెబ్రీ 6:10) నిజమే, మనందరి సామర్థ్యాలు, పరిస్థితులు వేరు, కానీ యెహోవా కోసం మనం మన శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండవచ్చు. (గల 6:4; కొలొ 3:23) ఎన్నో సంవత్సరాలుగా, వేలమంది సహోదరసహోదరీలు బెతెల్‌లో సేవ చేశారు. మీరు బెతెల్‌ సేవ చేయగలరా? మీరు చేయలేకపోతే, వేరే ఎవరైనా బెతెల్‌ సేవ మొదలుపెట్టేలా మీరు ప్రోత్సహించగలరా, లేదా ఆ ప్రత్యేక సేవలో కొనసాగేలా మీరు ఎవరికైనా సహాయం చేయగలరా?

బెతెల్‌ సేవ చేయడానికి ముందుకు రండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • మనం బెతెల్‌లో సేవ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమై ఉండాలి?

  • బెతెల్‌లో సేవ చేయడం వల్ల వచ్చిన ఆశీర్వాదాల గురించి కొంతమంది ఏమన్నారు?

  • బెతెల్‌ సేవ చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి?

  • మీరు బెతెల్‌ సేవ కోసం అప్లికేషన్‌ ఎలా పెట్టుకోవాలి?

ముగ్గురు బెతెల్‌ సభ్యులు ఒక కంప్యూటర్‌ దగ్గర పనిచేస్తున్నారు; ఒక సహోదరుడు ప్రచురణల్ని బాక్సుల్లోకి సర్దుతున్నాడు; ఒక సహోదరుడు బెతెల్‌లో చెక్కపని చేస్తున్నాడు

బెతెల్‌ సేవకు అవసరమైన అర్హతలు

  • యెహోవాను, ఆయన సంస్థను ఎంతో ప్రేమించాలి

  • ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించాలి, యెహోవా ముందు మంచి మనస్సాక్షితో ఉండాలి

  • బట్టలు, కనపడే తీరు విషయంలో క్రైస్తవులకు తగిన విధంగా ఉండాలి

  • క్రైస్తవులకు తగిన వినోదాన్ని ఎంచుకోవాలి

  • సాధారణంగా 19 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి

  • మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా మంచి ఆరోగ్యంతో ఉండాలి

  • బ్రాంచ్‌లో వాడే ముఖ్యమైన భాష చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి

  • బెతెల్‌లో కనీసం ఒక్క సంవత్సరం ఉండడానికి సిద్ధంగా ఉండాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి