మన క్రైస్తవ జీవితం
యెహోవా ఏమనుకుంటాడు?
మనం చిన్నదే గానీ పెద్దదే గానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ‘యెహోవా ఏమనుకుంటాడు?’ అని ఆలోచిస్తామా? నిజమే, మనం యెహోవా మనసులో ఉన్న ప్రతీది తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు; అయినాసరే, “ప్రతీ మంచి పని” కోసం మనల్ని సమర్థుల్ని చేయడానికి కావల్సిన ప్రతీదాన్ని ఆయన తన వాక్యంలో వెల్లడిచేశాడు. (2 తిమో 3:16, 17; రోమా 11:33, 34) యేసు యెహోవా ఇష్టాన్ని స్పష్టంగా అర్థంచేసుకున్నాడు, దానికి తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇచ్చాడు. (యోహా 4:34) యేసును అనుకరిస్తూ మనం కూడా యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి శాయశక్తులా కృషిచేద్దాం.—యోహా 8:28, 29; ఎఫె 5:15-17.
యెహోవా ఇష్టం ఏమిటో అర్థం చేసుకుంటూ ఉండండి (లేవీ 19:18) అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
మన జీవితంలో బైబిలు సూత్రాల్ని పాటించడం ఎందుకు ప్రాముఖ్యం?
సంగీతం ఎంచుకునేటప్పుడు ఏ బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలి?
బట్టలు, కనిపించే తీరు గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలి?
జీవితంలోని ఇంకా ఏయే విషయాల్లో మనం బైబిలు సూత్రాలు పాటించాలి?
యెహోవా ఇష్టాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనం ఏంచేయవచ్చు?
నా నిర్ణయాలు యెహోవాతో నాకున్న సంబంధం గురించి ఏం చెప్తున్నాయి?