కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 3
  • దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీ పిల్లలకు సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి నేర్పించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • సృష్టిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • కనిపించని దేవుణ్ణి ఎలా చూడగలం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 3

మన క్రైస్తవ జీవితం

దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?

రంగురంగుల పువ్వుల్ని, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని, పెద్దపెద్ద జలపాతాల్ని చూసినప్పుడు, అవి దేవుని చేతి పనులని మీరు అర్థంచేసుకుంటున్నారా? మన చుట్టూ ఉన్న సృష్టి దేవుని అదృశ్య లక్షణాల్ని స్పష్టంగా తెలియజేస్తుంది. (రోమా 1:20) మనం కళ్లతో చూసేవాటి గురించి కాసేపు ఆగి ఆలోచించినప్పుడు దేవునికున్న శక్తి, ప్రేమ, తెలివి, న్యాయం, ఔదార్యం వంటి లక్షణాల్ని చూడగలుగుతాం.—కీర్త 104:24.

దేవుని సృష్టి కార్యాల్లో మీరు ప్రతీరోజు ఏవేవి చూస్తున్నారు? మీరు నగరంలో జీవిస్తున్నాసరే పక్షుల్ని, చెట్లను చూడొచ్చు. దేవుని సృష్టిని జాగ్రత్తగా గమనించడం వల్ల మన ఆందోళన తగ్గుతుంది, సమస్యల మీద కాకుండా అత్యంత ప్రాముఖ్యమైన వాటి మీద దృష్టిపెడతాం, మనల్ని నిరంతరం చూసుకోగల యెహోవా సామర్థ్యం మీద విశ్వాసం పెరుగుతుంది. (మత్త 6:25-32) మీకు పిల్లలు ఉంటే, యెహోవా సాటిలేని లక్షణాల్ని అర్థంచేసుకోవడానికి వాళ్లకు సహాయం చేయండి. మన చుట్టూ ఉన్న సృష్టి పట్ల కృతజ్ఞత పెరిగేకొద్ది మనం సృష్టికర్తకు ఇంకా దగ్గరౌతాం.—కీర్త 8:3, 4.

సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి—వెలుగు, రంగులు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • రంగుల్ని చూడడానికి వర్ణకాలు (పిగ్‌మెంట్లు) ఎలా సహాయం చేస్తాయి?

  • వర్ణదీప్తి (ఇరిడిసెన్స్‌) ప్రక్రియకు కారణం ఏమిటి?

  • ఆకాశంలో వేర్వేరు రంగులు ఎందుకు కనిపిస్తాయి?

  • సృష్టిలోని ఎలాంటి అద్భుతమైన రంగుల్ని మీ ఇంటి దగ్గర చూశారు?

  • ప్రకృతిని శ్రద్ధగా గమనించడానికి ఎందుకు సమయం తీసుకోవాలి?

గులాబి పువ్వు, నీలం రంగు సీతాకోకచిలుక, రకరకాల రంగుల పండ్లు, ఆకాశంలోని సూర్యుడు

యెహోవా లక్షణాల గురించి వెలుగు, రంగులు ఏమి తెలియజేస్తున్నాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి