కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 నవంబరు పేజీ 7
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 నవంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి

ఒకతను విరాళాల పెట్టెలో విరాళం వేస్తున్నాడు; ఒకతను ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళం ఇస్తున్నాడు

నేడు మనమెలా మన చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వడానికి ముందుకు రావచ్చు? (1 దిన 29:5, 9, 14) మీ ప్రాంతంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు చేసే పనికి మద్దతుగా మనం స్వచ్ఛంద విరాళాలు ఏయే విధాలుగా ఇవ్వవచ్చో కింద వివరించారు.

ఆన్‌లైన్‌లో విరాళాలు పంపించడం, లేదా విరాళాల పెట్టెల్లో వేయడం:

  • ఒకతను ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళం ఇస్తున్నాడు

    ప్రపంచవ్యాప్త పనికోసం

    బ్రాంచ్‌ సదుపాయాలను, రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసులను నిర్మించి వాటిని నిర్వహించడానికి

    దైవపరిపాలనా పాఠశాలకు

    ప్రత్యేక పూర్తికాల సేవకులకు

    విపత్తు సహాయం

    ముద్రించడానికి, వీడియోలు రూపొందించడానికి, డిజిటల్‌ రూపంలో అందించడానికి

  • స్థానిక సంఘంలో విరాళం వేస్తున్నారు

    స్థానిక సంఘ ఖర్చులు

    రాజ్యమందిరాల్లో ఉండాల్సిన వస్తువుల కోసం, రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడానికి అవసరమైన మరమ్మతులు వంటి వాటికోసం అయ్యే సంఘ ఖర్చులు

    కింది విషయాల కోసం సంఘం నుండి బ్రాంచి కార్యాలయానికి నిధులు పంపించాలని సంఘంలో తీసుకున్న నిర్ణయాలు:

    • ప్రపంచవ్యాప్తంగా రాజ్యమందిరాల, సమావేశ హాలుల నిర్మాణం

    • ప్రపంచవ్యాప్త సహాయక ఏర్పాటు

    • ఇతర ప్రపంచవ్యాప్త పనుల కోసం

సమావేశాలు, అసెంబ్లీలు

మీ ప్రాదేశిక సమావేశం కొరకు ఇచ్చిన విరాళాలు ప్రపంచవ్యాప్త పనికోసం పంపించబడతాయి. అవసరాన్ని బట్టి, ప్రపంచవ్యాప్త పనికోసం కేటాయించిన విరాళాలను ప్రాదేశిక, ప్రత్యేక, అంతర్జాతీయ సమావేశాల ఖర్చులకు ఉపయోగిస్తారు.

ఒక సర్క్యూట్‌లో వచ్చిన విరాళాలను అసెంబ్లీలు జరిగే స్థలాలకు అద్దె చెల్లించడానికి, వాటిని నిర్వహించడానికి, వాటిని మంచి స్థితిలో ఉంచడానికి ఇంకా సర్క్యూట్‌కు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. అదనంగా ఉన్న నిధులను యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి పంపించాలని సర్క్యూట్‌ తీర్మానించుకోవచ్చు.

donate.jw.org

ఆన్‌లైన్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి

మీరు ఏ విధంగా విరాళం ఇవ్వవచ్చో తెలుసుకునేందుకు కిందున్న పద్ధతుల్ని చూడండి:

  • donate.jw.orgకి వెళ్లండి

  • jw.org/te వెబ్‌సైట్లో ఉన్న మా గురించి విభాగంలో “విరాళాలు” అనే ఆప్షన్‌ ఎంచుకోండి

  • JW లైబ్రరీ యాప్‌ హోం పేజీలో కిందున్న “విరాళాలు” అనే లింక్‌ను ఉపయోగించుకోండి

కొన్ని దేశాల్లో “తరచూ అడిగే ప్రశ్నలు” అనే శీర్షికతో ఒక పేజీ ఉంటుంది. విరాళాలకు సంబంధించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు అందులో జవాబులు ఉంటాయి.

ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి అనే వీడియో విరాళాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న పద్ధతుల గురించి సమాచారం ఇస్తుంది.

దానధర్మ రూపంలో విరాళాలు ఇవ్వడం

ప్రపంచవ్యాప్త పనికోసం ఇచ్చే కొన్ని రకాల విరాళాల విషయంలో ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి లేదా చట్టపరమైన సలహాలు తీసుకోవాలి. కింద ఇవ్వబడినవి ఆ కోవలోకి వస్తాయి:

  • వీలునామాలు, ట్రస్టులు

  • ఇళ్ల స్థలాలు, ఫ్లాటులు, షేర్లు, స్టాకులు, బాండ్లు, ఇన్సూరెన్సులు

  • షరతులతో కూడిన విరాళాలు

మీరు అలాంటి ఒక విరాళం ఇవ్వాలనుకుంటే donate.jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలు ఉపయోగించుకొని మీ బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి