మన క్రైస్తవ జీవితం
ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—సత్యమందు సంతోషించండి
ఎందుకు ముఖ్యం: యేసును అనుకరిస్తూ, మనం దేవుని సంకల్పాల గురించిన సత్యానికి సాక్ష్యం ఇవ్వాలి. (యోహా 18:37) అబద్ధాలతో, అవినీతితో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం సత్యాన్ని బట్టి సంతోషించాలి, సత్యమే మాట్లాడాలి, ఏవి సత్యమో వాటిపైనే దృష్టి పెట్టాలి.—1 కొరిం 13:6; ఫిలి 4:8.
ఎలా చేయాలి:
వేరేవాళ్లకు హానిచేసే పుకార్లు, అబద్ధాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని నిర్ణయించుకోవాలి.—1 థెస్స 4:11
వేరేవాళ్లకు చెడు జరగడం చూసి సంతోషించకూడదు
మంచి విషయాలను, ప్రోత్సాహకరమైన విషయాలను ఇష్టపడాలి
‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—దుర్నీతియందు కాక సత్యమందు సంతోషించండి అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
దీపిక ఏ విధంగా అవినీతి విషయంలో సంతోషించింది?
దీపికతో మాట్లాడుతున్నప్పుడు ఆశ ఆ సంభాషణను ఎలా మంచి విషయాల వైపుకు నడిపించింది?
మనం మాట్లాడుకోగలిగిన మంచి విషయాలు కొన్ని ఏంటి?
అవినీతిని బట్టి కాక, సత్యాన్ని బట్టి సంతోషించండి